అవినీతిరహిత రాష్ట్రమే మనందరి లక్ష్యం
ABN , Publish Date - Oct 28 , 2025 | 11:33 PM
అవినీతి రహి త రాష్ట్రమే మనందరి లక్ష్యమని కలెక్టర్ రాజకుమారి అన్నారు.
కలెక్టర్ రాజకుమారి
నంద్యాల నూనెపల్లి, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): అవినీతి రహి త రాష్ట్రమే మనందరి లక్ష్యమని కలెక్టర్ రాజకుమారి అన్నారు. మంగ ళవారం కలెక్టర్ చాంబర్‌లో జాయింట్ కలెక్టర్ కార్తీక్‌తో కలిసి అవినీతి రహిత ఆంధ్రప్రదేశ్ సాధనలో భాగంగా టోల్‌ఫ్రీ నెం 1064 పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలు ఎక్క డైనా అవినీతి ఘటనలు గమనించినపుడు వెంటనే టోల్‌ఫ్రీ నెం 1064కు సమాచారమివ్వాలని కోరారు. అన్నిశాఖల అధికారులు ప్రజలకు అవినీతి రహిత సేవలు అందించే దిశగా కృషి చేయాలని సూచించారు. అవినీతి నిరోధక శాఖ అధికారులు కృష్ణయ్య, ప్రభాకర్ పాల్గొన్నారు.