పరిశుభ్రమైన వాతావరణం కల్పించాలి
ABN , Publish Date - Sep 25 , 2025 | 11:22 PM
వసతిగృహాల్లో పరిశుభ్రమైన వాతావరణాన్ని కల్పించాలని కలెక్టర్ రాజకుమారి వసతిగృహ నిర్వాహకులకు ఆదేశించారు.
కలెక్టర్ రాజకుమారి
నంద్యాల ఎడ్యుకేషన్, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): వసతిగృహాల్లో పరిశుభ్రమైన వాతావరణాన్ని కల్పించాలని కలెక్టర్ రాజకుమారి వసతిగృహ నిర్వాహకులకు ఆదేశించారు. ‘ఏక్ దిన్.. ఏక్ గంట.. ఏక్ సాత్ స్వచ్ఛతా’ కార్యక్రమంలో భాగంగా దేవనగర్‌లోని సాంఘిక సంక్షేమశాఖ బాలురవసతి గృహంలో నిర్వహించిన శ్రమదానంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎక్కడపడితే అక్కడ చెత్త వేయకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు.