విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు
ABN , Publish Date - Dec 05 , 2025 | 11:40 PM
విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ప్రజాప్రతినిధులు, అధికారులు అన్నారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా పీటీఎం 3.0 కార్య క్రమం జిల్లా వ్యాప్తంగా శుక్రవారం సందడిగా సాగింది.
విద్యాభివృద్ధికి ప్రభుత్వం కృషి
అవకాశాలను విద్యార్థులు అందిపుచ్చుకోవాలి
‘మెగా పీటీఎం 3.0’లో ప్రజాప్రతినిధులు అధికారులు
అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు
నంద్యాల, డిసెంబరు5(ఆంధ్రజ్యోతి): విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ప్రజాప్రతినిధులు, అధికారులు అన్నారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా పీటీఎం 3.0 కార్య క్రమం జిల్లా వ్యాప్తంగా శుక్రవారం సందడిగా సాగింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో ఆయా పాఠశాలలు సందడిగా మారింది. వారు మాట్లాడుతూ విద్యాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని, విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకో వాలని ఆకాంక్షించారు. అవకాశాలను విద్యార్థులు అందిపు చ్చుకుం టేనే మంచి జీవితం ఉంటుందని సూచించారు. పదో తరగతిలో వందశాతం ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాల న్నారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల చదువును ప్రోత్సహిం చాలన్నారు. ఆయా ప్రాంతాల నాయకులు, ఉపాధ్యాయులు కలిసి నిర్వహించారు. ముందుగా ప్రజాప్రతినిధులు, అధికారులు విద్యా ర్థులకు పలు అంశాలపై సూచనలు చేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. మెగా పీటీఎంలో భాగంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
హాజరైన మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు
నంద్యాల మండలంలోని చాపిరేవుల గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్స్, టీచర్స్ (పీటీఎం) మీట్‌లో మంత్రి ఫరూక్, డీఈవో జనార్దన్‌రెడ్డి, అవుకు జడ్పీ ఉన్నత పాఠశాల, బనగానపల్లె మండలం కొండపేటలోని ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన మెగా పీటీఎం కార్యక్రమానికి మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి హాజరయ్యారు. ఉయ్యాలవాడ కేజీబీవీలో జరిగిన కార్యక్రమంలో డీఈవో పాల్గొన్నారు. చాగలమర్రిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కలెక్టర్ రాజకుమారి, డోన్ పట్టణంలోని జడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ ధర్మవరం సుబ్బారెడ్డి, హాజరయ్యారు. పాములపాడు మండల కేంద్రంలోని జడ్పీ హైస్కూల్‌లో నిర్వహించిన మెగా పీటీఎం కార్యక్రమానికి ఎమ్మెల్యే గిత్తా జయసూర్య, మహానంది మండలం ఎం. తిమ్మాపురంలోని మోడల్ స్కూల్‌లో నిర్వహించిన మెగా పీటీఎంలో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి, ఉయ్యాలవాడ కేజీబీవీలో జరిగిన కార్యక్రమంలో డీఈవో పాల్గొన్నారు.