చదువుతోనే ఉజ్వల భవిష్యత్తు
ABN , Publish Date - Nov 14 , 2025 | 11:17 PM
విద్యార్థులకు చదువుతోనే ఉజ్వల భవిష్యత్తు అని డీఈవో జనార్దన్‌రెడ్డి అన్నారు.
డీఈవో జనార్దన్‌రెడ్డి
ఘనంగా బాలల దినోత్సవం
నంద్యాల రూరల్, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులకు చదువుతోనే ఉజ్వల భవిష్యత్తు అని డీఈవో జనార్దన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని రాయమాల్పురం ఎంపీయూపీ పాఠశాలలో నిర్వహించిన బాలల దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సంద ర్భంగా పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. డీఈవో మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత చదువులు చదివి గ్రామంలో పాటు తల్లిదండ్రులకు మంచి పేరు తేవా లని సూచించారు. మండలంలోని అన్ని పాఠశాలల్లో బాలల దినోత్స వాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు అనంతలక్ష్మి, సుజాత, ఓబయ్య, సత్యవతమ్మ పాల్గొన్నారు.