మరణంలోనూ వీడని బంధం
ABN , Publish Date - Oct 19 , 2025 | 11:38 PM
వృద్ధుడి వయసు 93 ఏళ్లు.. వృద్ధురాలి వయసు 83 ఏళ్లు. వృద్ధాప్యంలో కూడా దంపతులిద్దరూ ఒకరికొకరు తోడుగా ఉంటూ జీవనం సాగించేవారు.
భార్య మృతితో ఆగిన భర్త గుండె
ప్యాపిలి, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): వృద్ధుడి వయసు 93 ఏళ్లు.. వృద్ధురాలి వయసు 83 ఏళ్లు. వృద్ధాప్యంలో కూడా దంపతులిద్దరూ ఒకరికొకరు తోడుగా ఉంటూ జీవనం సాగించేవారు. అయితే వయస్సు మీద పడటంతో పాటు అనారోగ్యం తోడు కావడంతో భార్య మృతి చెందింది. భార్య మరణ వార్త విని భరించలేక భర్త కూడా మృతి చెందారు. ఈ విషాద ఘటన ఆదివారం నంద్యాల జిల్లా ప్యాపిలి పట్టణంలో జరిగింది. పట్టణానికి చెందిన ఆర్వేటి లక్ష్మీనారాయణ (93) గ్రంథాలయం అధికారిగా పని చేసి 33 ఏళ్ల క్రితం పదవీ విరమణ పొందారు. ఆయన భార్య వెంకటలక్ష్మమ్మ (83) గృహిణి. ఈ దంపతులకు నలుగురు కుమారులు ఉన్నారు. వీరిలో ఇద్దరు కొడుకులు అనారోగ్యంతో మృతి చెందారు. ఒక కుమారుడు బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌గా పనిచేస్తున్నారు. పట్టణంలో ఉంటున్న మూడో కుమారుడు దగ్గర వృద్ధ దంపతులు ఉంటున్నారు. నిద్రలోనే భార్య మరణించిన విషయం తెలిసిన కొద్ది గంటలకే భర్త కూడా తుదిశ్వాస వదిలారు.