Share News

ప్రజా సమస్యల పరిష్కారవేదికకు 80 ఫిర్యాదులు: ఎస్పీ

ABN , Publish Date - Aug 25 , 2025 | 11:20 PM

నంద్యాల జిల్లా పోలీస్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా 80 ఫిర్యాదులను స్వీకరించినట్లు ఎస్పీ అధిరాజ్‌సింగ్‌ రాణా తెలిపారు.

ప్రజా సమస్యల పరిష్కారవేదికకు 80 ఫిర్యాదులు: ఎస్పీ
ఫిర్యాదులను స్వీకరిస్తున్న ఎస్పీ అధిరాజ్‌సింగ్‌ రాణా

నంద్యాల ఎడ్యుకేషన్‌, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): నంద్యాల జిల్లా పోలీస్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా 80 ఫిర్యాదులను స్వీకరించినట్లు ఎస్పీ అధిరాజ్‌సింగ్‌ రాణా తెలిపారు. గడివేముల మండలం గని గ్రామ పరిధిలో తన 3.54 ఎకరాల భూమిలో సాగు చేయనీయకుండా ఎల్‌కే తాండాకు చెందిన మధునాయక్‌ ఇబ్బందిపెడుతున్నాడని జనార్ధన్‌నాయక్‌ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. రమే్‌షరెడ్డి అనే వ్యక్తి రూ.70 వేలు తీసుకుని పదిరోజుల్లో ఇస్తానని చెప్పి నేటికీ ఇవ్వకుండా బెదిరిస్తున్నారని నంద్యాల పట్టణానికి చెందిన రవికుమార్‌ ఆచారి ఫిర్యాదు చేశారు. ఎస్సీ కార్పొరేషన్‌లో రుణం, ఉద్యోగం ఇప్పిస్తానని వహిదా అనే మహిళ రూ.1.75లక్షలు తీసుకుని స్పందించడం లేదని నంద్యాల పట్టణం జ్ఞానాపురంకు చెందిన కుమారి ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి పరిష్కరిస్తామన్నారు. చట్టపరిధిలో ఉన్న సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపాలని, ఫిర్యాదుల పట్ల నిర్లక్ష్యం చూపించవద్దని పోలీసు అధికారులను ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు.

Updated Date - Aug 25 , 2025 | 11:20 PM