70 శాతం హామీలు అమలు
ABN , Publish Date - Jun 10 , 2025 | 11:56 PM
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన ఏడాది కాలంలో 70 శాతం హామీలను అమలు చేసిందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు పాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు.

టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి
కర్నూలు అర్బన్, జూన్ 10(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన ఏడాది కాలంలో 70 శాతం హామీలను అమలు చేసిందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు పాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు. మంగళవారం కర్నూలు నగరంలోని టీడీపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం రూ.10లక్షల కోట్ల రుణం చేసి ప్రజలపై పెనుభారాన్ని మోపిందన్నారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో కూరుకుపోయేలా జగన్ పాలన సాగిందన్నారు. రాష్ట్రం దివాళా తీసే పరిస్థితిలో ఉన్న రాష్ట్రాన్ని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం గాడిలో పెడుతోందన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు తన అనుభవం, కఠోర కష్టంతో తొలి ఏడాదిలోనే 70 శాతానికి పైగా అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేశారన్నారు. ఈస్థాయిలో గతంలో ఏ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయలేదన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దుచేసి ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించడం, సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లించకుండా ఎస్సీ, ఎస్టీ బీసీ వర్గాలకు ఉపాధి కల్పించడం, ఎస్సీ వర్గీకరణ అమలు, నాయీబ్రహ్మణుల వేతనాలు రూ.25 వేలు పెంచామన్నారు.