Share News

508 సెల్‌ఫోన్లు రికవరీ

ABN , Publish Date - Aug 21 , 2025 | 11:33 PM

జిల్లాలో చోరీకి గురైన 508 సెల్‌ఫోన్లను బాధితులకు అందజేసినట్లు ఎస్పీ అధిరాజ్‌ సింగ్‌ రాణా తెలిపారు.

508 సెల్‌ఫోన్లు రికవరీ
బాధితులకు సెల్‌ఫోన్లు అందజేసిన ఎస్పీ

బాధితులకు అందజేసిన ఎస్పీ అధిరాజ్‌సింగ్‌ రాణా

నంద్యాల టౌన్‌, ఆగస్టు 21(ఆంధ్రజ్యోతి): జిల్లాలో చోరీకి గురైన 508 సెల్‌ఫోన్లను బాధితులకు అందజేసినట్లు ఎస్పీ అధిరాజ్‌ సింగ్‌ రాణా తెలిపారు. గురువారం పట్టణంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో రిక వరీ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సెల్‌ ఫోన్లను వివిధరాష్ట్రాల నుంచి మహారాష్ట్ర, తమిళనాడు, గోవా, ఏపీ, తెలం గాణ వంటి ప్రాంతాల నుంచి సైబర్‌క్రైం వారి సహకారంతో 508 ఫో న్లను రికవరీచేసినట్లు తెలిపారు. వాటివిలువ సుమారుగా రూ.83,82,000 ఉంటుందని చెప్పారు. జిల్లాలో అతి తక్కువ సమయంలో ఎవరి ఫోన్లను వారికి అందజేశామన్నారు. ఇంకా మిగిలిన ఫోన్లను వారి పరిధిలోని డీఎస్పీ కార్యాలయంలో అందజేయనున్నట్లు తెలిపారు. సెల్‌ఫోన్‌ పోతే వెంటనే 9121101107 నెంబర్‌కు హాయ్‌ అని మెసేజ్‌ చేస్తే వెంటనే లింక్‌ వస్తుందని, అందులో ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. కార్యక్రమంలో ఏఎస్పీ యుగంధర్‌బాబు, ఎస్బీ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, సైబర్‌ క్రైం సీఐ వంశీధర్‌, జిల్లా పోలీసు కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Aug 21 , 2025 | 11:33 PM