Share News

4,700 ఉపాధ్యాయ బదిలీల ఖాళీలు

ABN , Publish Date - May 11 , 2025 | 12:16 AM

కర్నూలు ఉమ్మడి జిల్లాలో 4,700 ఉపాధ్యాయ బదిలీల ఖాళీలు ఉన్నాయని డీఈవో శామ్యూల్‌పాల్‌ అన్నారు.

4,700 ఉపాధ్యాయ బదిలీల ఖాళీలు
మాట్లాడుతున్న డీఈవో శామ్యుల్‌పాల్‌

90శాతం పోస్టులను ఆన్‌లైన్‌లో ఎంట్రీ

డీఈవో శామ్యూల్‌పాల్‌

ఉమ్మడి జిల్లా విద్యా శాఖాధికారులతో సమావేశం

కర్నూలు ఎడ్యుకేషన్‌, మే 10 (ఆంధ్రజ్యోతి): కర్నూలు ఉమ్మడి జిల్లాలో 4,700 ఉపాధ్యాయ బదిలీల ఖాళీలు ఉన్నాయని డీఈవో శామ్యూల్‌పాల్‌ అన్నారు. శనివారం స్థానిక మాంటిస్సోరి పాఠశాలలో ఉమ్మడి జిల్లా విద్యాశాఖ అధికారులతో ఉపాధ్యాయ బదిలీ ఖాళీలపై సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో 4,700 ఉపాధ్యాయ ఖాళీలను ఆన్‌లైన్‌లో అప్‌లోడు చేశామన్నారు. ఇందులో ఎనిమిదేళ్లు సర్వీసు పూర్తయిన ఉపాధ్యాయులు, స్టడీలో ఉన్న ఉపాధ్యాయులు, దీర్ఘకా లికంగా లీవ్‌లో ఉన్నవారందరి పోస్టులను భర్తీచేయనున్నట్లు తెలిపారు. మొదటి రోజు 90శాతం పోస్టు లను ఆన్‌లైన్‌లో ఎంట్రీ చేశామని, మిగిలిన 10శాతాన్ని ఆదివారం పూర్తి చేయనున్నట్లు డీఈవో వివరించారు. రాష్ట్రంలోనే అత్యధిక ఉపాధ్యాయ ఖాళీలు ఉన్న జిల్లా ఉమ్మడి కర్నూలు జిల్లానే అని తెలిపారు. ఇప్పటి వరకు అత్యధికంగా ఎంట్రీ చేసింది కూడా కర్నూలు జిల్లానే అని అన్నారు. ఖాళీలను ఆన్‌లైన్‌లో అప్‌లోడు చేసి, ప్రభుత్వం అనుమతించాక ఉపాధ్యాయ ఖాళీలను ఆన్‌లైన్‌లో ఉంచుతామన్నారు. ప్రభుత్వం ఉపాధ్యాయ బదిలీల గైడెన్స్‌ ఇచ్చిన తర్వాత ఉపాధ్యాయుల బదిలీలకు ఆప్షన్లు ఇచ్చుకోవాల్సి ఉందన్నారు. కార్యక్రమంలో నంద్యాల జిల్లా డీఈవో జనార్దన్‌రెడ్డి, డిప్యూటీ డీఈవోలు, మండల విద్యాశాఖ అధికారులు, సూపరింటెండెంట్స్‌, సిబ్బంది ఉన్నారు.

Updated Date - May 11 , 2025 | 12:16 AM