Share News

పది పరీక్షలకు 33,930 మంది

ABN , Publish Date - Dec 24 , 2025 | 11:40 PM

పదో తర గతి పబ్లిక్‌ పరీక్షలకు రాష్ట్రంలోనే కర్నూలు జిల్లా నుంచి అత్యధికంగా విద్యార్థులు నమోదు చేసుకున్నారు.

పది పరీక్షలకు 33,930 మంది

అత్యధికంగా కర్నూలు జిల్లా నుంచే

కర్నూలు ఎడ్యుకేషన్‌ , డిసెంబరు 24(ఆంధ్రజ్యోతి): పదో తర గతి పబ్లిక్‌ పరీక్షలకు రాష్ట్రంలోనే కర్నూలు జిల్లా నుంచి అత్యధికంగా విద్యార్థులు నమోదు చేసుకున్నారు. పరీక్ష ఫీజు చెల్లింపు, నామినల్‌ రోల్‌ దాదాపుగా పూర్తయింది. ఈ ప్రక్రియ పూర్తి కావడంతో ప్రభుత్వ పరీక్షల విభాగం తుది జాబితాను ఖరారు చేసింధి. 2026 మార్చి 18 నుంచి ఏప్రిల్‌ 1వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరుగుతాయి. కర్నూలు జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు మొత్తం 571 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఇందుల్లో ప్రభుత్వ పాఠశాలలు 361, కాగా ప్రైవేట్‌ పాఠశాలలు 210 ఉన్నాయి. జిల్లాలోని అన్ని యాజమాన్యాల 361 ఉన్నత పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులు 23,291 మంది ఉండగా 23,278 మంది ఫీజు చెల్లించారు. జిల్లాలోని మున్సిపల్‌ పాఠశాలలో 1605 మంది చెల్లించారు. జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 16,238 మందికిగాను, 16,225 మంది మాత్రమే ఫీజు చెల్లించారు. ఇంకా 13 మంది ఫీజు చెల్లించలేదు. ప్రభుత్వ పిఠశాలలో 1811 మంది, ఏపీఎంఎస్‌ 1390, కేజీబీవీలో 1041, మహాత్మాజ్యోతిరావు పూలే గురుకులాల్లో 215, ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ స్కూలో 533, ఏపీటీడబ్ల్యూఆర్‌ఎస్‌లో 78, ఏపీఆర్‌ఎస్‌ 326, ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలలో 54 మంవి విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లిం చారు. విద్యా ర్థులు ఫీజు కట్టకపోతే, పాఠశాల ఉత్తీర్ణత శాతం పెంచు కోవచ్చనే భావనతో పాఠశాల ప్రధానోపాధ్యాయలు ఉన్నట్లు ఆరో పణులు ఉన్నాయి. ఈసారి అధిక శాతం విద్యార్థులు ఆంగ్ల మాధ్య మంలోను పరీక్షలకు హాజరవుతున్నారు.

Updated Date - Dec 24 , 2025 | 11:40 PM