ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 334 అర్జీలు
ABN , Publish Date - Aug 25 , 2025 | 11:22 PM
నంద్యాల కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 334 అర్జీలు వచ్చాయి.
నంద్యాల ఎడ్యుకేషన్, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): నంద్యాల కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 334 అర్జీలు వచ్చాయి. ఈ సందర్భంగా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ ఫిర్యాదులను నిర్ధేశించిన గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించామని చెప్పారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి సంబంధించి బండిఆత్మకూరు, నందికొట్కూరు, నంద్యాల, గోస్పాడు, బనగానపల్లె, చాగలమర్రి మండలాల్లో ఎక్కువ శాతం పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. రీ ఓపన్ కేసులపై ప్రత్యేక దృష్టిసారించి అర్జీదారుడు సంతృప్తి చెందేలా పరిష్కారంలో జాప్యం లేకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ విష్ణుచరణ్, డీఆర్వో రామునాయక్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.