జిల్లాలో 333 వెబ్ ల్యాండ్స్ గుర్తింపు
ABN , Publish Date - Apr 10 , 2025 | 12:15 AM
స్పేస్ అప్లికేషన్ సెంటర్ అట్లాస్ ప్రకారం జిల్లాలో 333 వెబ్ ల్యాండ్స్ గుర్తింపు మేరకు భూముల సరిహద్దులతో పాటు గ్రౌండ్ ట్రూతింగ్ తదితర వివరాలతో వారంలోపు నివేదిక సమర్పించాలని కలెక్టర్ రంజిత్ బాషా సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.
సరిహద్దుల నివేదిక వారంలోపు సమర్పించాలి
అధికారులకు కలెక్టర్ రంజిత్ బాషా ఆదేశం
కర్నూలు కలెక్టరేట్, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): స్పేస్ అప్లికేషన్ సెంటర్ అట్లాస్ ప్రకారం జిల్లాలో 333 వెబ్ ల్యాండ్స్ గుర్తింపు మేరకు భూముల సరిహద్దులతో పాటు గ్రౌండ్ ట్రూతింగ్ తదితర వివరాలతో వారంలోపు నివేదిక సమర్పించాలని కలెక్టర్ రంజిత్ బాషా సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా వెబ్ ల్యాండ్ కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ వెబ్ ల్యాండ్ రూల్స్-2017 ప్రకారం జిల్లాలో వెబ్‌ల్యాండ్ సంరక్షణ, నిర్వహణ కోసం జిల్లా వెబ్‌ల్యాండ్ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నీరు నిల్వ ఉండే ప్రాంతాలు సహజంగా గానీ, కృత్రిమంగా గానీ, శాశ్వతంగా గానీ, తాత్కాలికంగా గానీ, స్థిరంగా గానీ, ప్రవేహించే తాజా సముద్ర నీటి ప్రాంతాలతో సహా తక్కువ అలలతో, లోతు ఆరు మీటర్లు గల నీటి సముదాయాలను వెబ్ ల్యాండ్ కింద పరిగణించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డా.బి. నవ్య, డీఎఫ్‌వో శ్యామల, ఇరిగేషన్ ఎస్‌ఈ ద్వారకానాథ్ రెడ్డి, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ నాగేశ్వరరావు, జిల్లా వ్యవసాయాధికారి వరలక్ష్మి, జిల్లా పంచాయతీ అధికారి భాస్కర్ పాల్గొన్నారు.