25 స్వర్ణ, 22 రజత పతకాలు
ABN , Publish Date - Dec 10 , 2025 | 12:16 AM
గుంటూరులో నిర్వహంచిన రెండో దక్షిణ మండల సీలంబం చాంపియన్‌షిప్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు 25 స్వర్ణాలు, 22 రజత పతకాలు సాధించారు.
కర్నూలు స్పోర్ట్స్, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): గుంటూరులో నిర్వహంచిన రెండో దక్షిణ మండల సీలంబం చాంపియన్‌షిప్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు 25 స్వర్ణాలు, 22 రజత పతకాలు సాధించారు. మంగళవారం రాష్ట్ర మంత్రి టీజీ భరత్ స్వగృహంలో క్రీడాకారులను అభినందించారు. క్రీడాకారులను తీర్చిదిద్దిన కోచ్‌లకు, అసోసియేషన్ సెక్రటరీ మహావీర్‌ను, జాయింట్ సెక్రటరీ బహదూర్ కృషి చేశారన్నారు. జిల్లాలో క్రీడాభివృద్ధి, క్రీడాకారుల సంక్షేమానికి నిరంతరం టీజీవీ సంస్థలు కృషి చేస్తాయన్నారు.