Share News

బాలికపై అత్యాచారం కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష

ABN , Publish Date - Sep 13 , 2025 | 12:30 AM

మాయమాటలు చెప్పి బాలికను కిడ్నాప్‌ చేసి ఆ తర్వాత పలుమార్లు అత్యాచారం చేసిన నిందితుడిపై నేరం రుజువు కావడంతో 20 సంవత్సరాల కారాగార శిక్ష, రూ.35 వేలు జరిమానా విధిస్తూ కర్నూలు పోక్సో కోర్టు న్యాయాదికారి ఈ.రాజేంద్రబాబు శుక్రవారం తీర్పు చెప్పారు.

బాలికపై అత్యాచారం కేసులో  నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష
నిందితుడు సాకే రాజుకుమార్‌

కర్నూలు లీగల్‌, సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి): మాయమాటలు చెప్పి బాలికను కిడ్నాప్‌ చేసి ఆ తర్వాత పలుమార్లు అత్యాచారం చేసిన నిందితుడిపై నేరం రుజువు కావడంతో 20 సంవత్సరాల కారాగార శిక్ష, రూ.35 వేలు జరిమానా విధిస్తూ కర్నూలు పోక్సో కోర్టు న్యాయాదికారి ఈ.రాజేంద్రబాబు శుక్రవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్‌ కథనం మేరకు.. నంద్యాలకు చెందిన బాలిక తల్లిదండ్రులు చిరు వ్యాపారం చేసుకుంటూ వారి పిల్లలను చదివించుకుంటుండేవారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో రోజూ వచ్చి నంద్యాలలో ఉంటున్న సాకే రాజ్‌కుమార్‌ అలియాస్‌ పెద్ద ఆ బాలికకు మాయమాటలు చెప్పేవాడు. ఈ క్రమంలో 2018 నవంబరు 14న బాలికకు మాయమాటలు చెప్పి కర్నూలు తీసుకెళ్లి అక్కడి నుంచి బస్సులో విజయవాడకు తీసుకెళ్లా డు. రాజుకుమార్‌ విజయవాడలో తన తల్లి వద్దకు తీసుకెళ్లి బాలికను పరిచయం చేశాడు. ఆ తర్వాత నిందితుడు ఆ బాలికను తన ఇంట్లో ఉంచుకుని పలుమార్లు అత్యాచారం చేశాడు. తిరిగి నిందితుడు ఈ బాలికను హైదరాబాదుకు తీసుకెళ్లి ఓ లాడ్జిలో ఉంచి పలుమార్లు అత్యాచారం చేశాడు. 2019 మార్చి 10వ తేదీన బాలిక తప్పించుకుని నంద్యాలకు చేరుకుని జరిగిన విషయాన్ని తన తల్లిదండుల్రకు చెప్పింది. కూతురు కనిపించకపోవడంతో బాలిక తల్లిదండ్రులు నంద్యాల పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేశారు. బాలిక తల్లిదండ్రులతో కలిసి నంద్యాల పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు మిస్సింగ్‌ కేసును మార్చి కిడ్నాప్‌, అత్యాచారం సెక్షన్ల కింద నిందితుడిపై కేసు నమోదు చేశారు. పోలీసులు కేసును విచారించి నిందితుడితో పాటు అతడి తల్లిదండ్రులు, బంధువులపై కేసు నమో దు చేసి కోర్టులో చార్జ్‌షీటు దాఖలు చేశారు. అయితే కోర్టులో సాకే రాజ్‌కుమార్‌పై మాత్రమే నేరం రుజువు కావడంతో అతడికి 20 సంవత్సరాల కారాగారశిక్షతో పాటు రూ.35 వేలు జరిమానా విధిస్తూ న్యాయాధికారి తీర్పు చెప్పారు. బాధిత మహిళకు రూ.2 లక్షల పరిహారాన్ని ప్రభుత్వం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ప్రాసిక్యూషన్‌ తరుపున స్పెషల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ సీవీ శ్రీనివాసులు వాదించారు.

Updated Date - Sep 13 , 2025 | 12:30 AM