20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యం
ABN , Publish Date - Dec 09 , 2025 | 01:20 AM
ఎన్నిల్లో ఇచ్చిన హామీ మేరకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే తన లక్ష్యమని పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖల మంత్రి టీజీ భరత్ పెర్కొన్నారు. సోమవారం కేవీఆర్ మహిళా డిగ్రీ కళాశాలలో నేషనల్ కేరీర్ సర్వీసు, ఏపీఎస్‌ఎస్‌డిసీ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళాను మంత్రి ప్రారంభించారు. విద్య, ఐటీ మంత్రి లోకేష్ ఆదేశాల మేరకు జిల్లాలో ఏర్పాటు కానున్న కంపెనీలకు తగ్గట్టుగా యువతకు శిక్షణ ఇస్తున్నామన్నారు
కంపెనీలకు తగ్గట్టుగా జిల్లా యువతకు శిక్షణ
పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్
కర్నూలు అర్బన్, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): ఎన్నిల్లో ఇచ్చిన హామీ మేరకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే తన లక్ష్యమని పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖల మంత్రి టీజీ భరత్ పెర్కొన్నారు. సోమవారం కేవీఆర్ మహిళా డిగ్రీ కళాశాలలో నేషనల్ కేరీర్ సర్వీసు, ఏపీఎస్‌ఎస్‌డిసీ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళాను మంత్రి ప్రారంభించారు. విద్య, ఐటీ మంత్రి లోకేష్ ఆదేశాల మేరకు జిల్లాలో ఏర్పాటు కానున్న కంపెనీలకు తగ్గట్టుగా యువతకు శిక్షణ ఇస్తున్నామన్నారు. 1,550 మందికి ఉద్యోగాలు ఉన్నాయని, 21 కంపెనీలు జాబ్ మేళాలలో పాల్గొన్నాయ న్నారు. జిల్లా ఉపాదికల్పనాధికారి పి. దీప్తి మాట్లా డుతూ జిల్లాలోని నిరుద్యోగులంతా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. స్కిల్ డెవలప్ మెంట్ అధికారి ఆనంద్ రాజ్ కుమార్, కోఆర్డినేటర్ డాక్టర్ జజి. గిరిజారాణి, ప్రిన్సిపాల్ వెంకటరెడ్డి, ఓఎస్టీ ఎస్‌ఎం బాషా, ఎంప్లామెంట్ ఆఫీసర్ సి. చంద్రకళ, కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.
క్యాంపస్‌లోనే పరిశ్రమల ఏర్పాటు హర్షణీయం
కర్నూలు ఎడ్యుకేషన్: క్యాంపస్‌లోనే పరిశ్రమల ఏర్పాటు హర్షణీయమని మంత్రి టీజీ భరత్ అన్నారు. బి.తాండ్రపాడు శ్రీచైతన్య బాలుర హాస్టల్ క్యాంపస్‌లో సోమవారం ఇంటర్ విద్యార్థుల వ్యక్తిత్వ వికాసం, ఉన్నత లక్ష్యాల అంశంపై కేఎల్ యూనివర్సిటీ, శ్రీ చైతన్య విద్యాసంస్థలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన సదస్సులో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. విద్యార్థుల కోసం కేఎల్ యూనివర్సిటీ అమలు చేస్తున్న ప్రణాళికలను మంత్రి ప్రశంసించారు. ప్రతిష్టాత్మకైన పరిశ్రమలు ఎన్నో రాష్ట్రంలో ఏర్పాటు అవుతున్నాయనీ, తద్వారా యువతకు మంచి ప్యాకేజీతో ఉద్యోగాలు లభిస్తాయన్నారు. కేఎల్ యూనివర్సిటీ డైరెక్టర్ డా.జే.శ్రీనివాసరావు సమకాలిన విద్యావిదానాలను విశ్లేశించారు. రాయలసీమ జోన్ హెడ్ కేశవగౌడు, శ్రీచైతన్య విద్యాసంస్థల ఏజీఎం మురళికృష్ణ, డీన్ బాలాజీ, జోనల ఇన్‌చార్జి కృపరాజు, అద్యాపకులు పాల్గొన్నారు.