లాటరీ పద్ధతిన 19 బార్లు ఎంపిక
ABN , Publish Date - Aug 30 , 2025 | 11:20 PM
కొత్త బార్ పాలసీని జాయింట్ కలెక్టర్ బీ. నవ్య లాటరీ పద్ధతిన ఎంపిక చేశారు.
7 బార్లకు ముందుకు రాని యాజమాన్యాలు
83 దరఖాస్తులతో రూ. 4.15 కోట్ల ఆదాయం
ఇద్దరు మహిళలకు వరించిన లాటరీ
పెండింగ్ బార్లకు రీ నోటిఫికేషన్ కు అవకాశం
జేసీ, డీసీ, ఈఎస్ ఆఽధ్వర్యంలో ముగిసిన ప్రక్రియ
కర్నూలు అర్బన్, ఆగస్టు 29(ఆంధ్రజ్యోతి): కొత్త బార్ పాలసీని జాయింట్ కలెక్టర్ బీ. నవ్య లాటరీ పద్ధతిన ఎంపిక చేశారు. శనివారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ డిప్యూటీ కమిషనర్ పి. శ్రీదేవి, సూపరింటెండెంట్ ఎం. సుధీర్ బాబు అఽధ్యక్షతన ఎంపిక ప్రక్రియ జరిగింది. ఉదయం 8 గంటలలోపే జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి బార్ల యాజమాన్యాలు జిల్లా పరిషత్ ఆవరణానికి చేరుకున్నాయి. 26 బార్లకు లైసెన్ ్స జారీ కోసం నోటిఫికేషన్ జారీ చేయగా అందులో 3 బార్లను గీత కులాలకు కేటాయించారు. కర్నూలు నగరంలో 16 బార్లకు గాను 12, ఆదోనిలో 4, గీత కులాలకు సంబంధించి కర్నూలు-2, ఆదోని-1కి సంబంధించి 83 దరఖాస్తుల ద్వారా ప్రభుత్వానికి రూ. 4.15 కోట్ల ఆదాయం సమకూరింది. లాటరీ ప్రక్రియను సీఐ రాజేంద్రప్రసాద్ టోకెన్ పద్ధతిన లబ్ధిదారులకు చదివి వినిపించగా సూపరింటెండెంట్ ఎం. సుధీర్‌బాబు బాక్స్‌లో వేసిన కాయిన్స్‌ను జాయింట్ కలెక్టర్ చేతుల మీదుగా ఎంపిక చేయించారు. జనరల్ కేటగిరీలో ఆదోనిలో వెళ్లాల లలితమ్మ, గీతకులాల జాబితాలో కర్నూలు నగరానికి ఆస్పరి రజిత ఎంపిక కావడంతో వారికి రెండు బార్లను కేటాయించారు. కాగా కర్నూలు-4, ఎమ్మిగనూరు-2, గూడూరు-1 బార్లకు సంబంధించి ఎవరూ దరఖాస్తు చేసుకోకపోవడంతో మరోసారి 7 బార్లకు రీ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉందని ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ అధికారులు తెలిపారు.