Share News

శ్రీశైలం దేవస్థానం బోర్డులో 16 మందికి చోటు

ABN , Publish Date - Oct 03 , 2025 | 11:52 PM

శ్రీశైలం దేవస్థానం ట్రస్టు బోర్డు సభ్యు లుగా 16మందికి అ వకాశం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది.

శ్రీశైలం దేవస్థానం బోర్డులో 16 మందికి చోటు

శ్రీశైలం దేవస్థానం ట్రస్టు బోర్డులో ఇద్దరికి చోటు

నంద్యాల/ డోన్‌ టౌన్‌, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం దేవస్థానం ట్రస్టు బోర్డు సభ్యు లుగా 16మందికి అ వకాశం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. ట్రస్టుబోర్డులో శ్రీశైలానికి చెందిన చిటా బొట్ల భర ద్వాజ్‌శర్మ, గుల్ల గంగమ్మ, ఎమ్మిగనూరుకు చెందిన రేఖాగౌడ్‌, నంద్యాలకి చెందిన సింధుశ్రీ, పాణ్యంకు చెందిన శివమ్మ నియమితులయ్యారు. డోన్‌ మం డలంలోని ఎర్రగుంట్ల గ్రామానికి చెందిన జి.లక్ష్మీశ్వరికి చోటు కల్పిస్తూ కూటమి ప్రభుత్వం జీవో విడుదల చేసింది. డోన్‌ నియోజకవర్గం బేతంచెర్లకు చెందిన బుగ్గన చంద్ర మౌళీశ్వరరెడ్డిని ప్రత్యేక ఆహ్వానితుల కమిటీ సభ్యుడిగా నియమించారు. ఈ అవకాశం కల్పించిన ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - Oct 03 , 2025 | 11:52 PM