వందేమాతర గేయానికి150 ఏళ్లు
ABN , Publish Date - Nov 08 , 2025 | 12:37 AM
వందేమాతర గేయానికి 150 ఏళ్లు పూర్తయిందని వీసీ ప్రొఫెసర్ ఎస్‌ఎస్‌షా వళీ ఖాన్ అన్నారు. శుక్రవారం డాక్టర్ అబ్దుల్ హక్ ఊర్దూ యూనివర్సీటీలో జాతీయ గేయాలాపన దినోత్సవాన్ని ఎన్ ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో నిర్వమించారు.
ప్రభుత్వ కార్యాలయాలు, యూనివర్సిటీల్లో వేడుకలు
కొండారెడ్డి బురుజు వద్ద ఎన్‌సీసీ కేడెట్ల పరేడ్
కర్నూలు అర్బన్ , నవంబరు 7(ఆంధ్రజ్యోతి): వందేమాతర గేయానికి 150 ఏళ్లు పూర్తయిందని వీసీ ప్రొఫెసర్ ఎస్‌ఎస్‌షా వళీ ఖాన్ అన్నారు. శుక్రవారం డాక్టర్ అబ్దుల్ హక్ ఊర్దూ యూనివర్సీటీలో జాతీయ గేయాలాపన దినోత్సవాన్ని ఎన్ ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో నిర్వమించారు. రిజిష్ట్రార్, ప్రొఫెసర్ వి. లోక్‌నాథ్, ఇంచార్జీ ప్రిన్సిపాల్ ఎస్ మహబూబ్ బాషా, బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.
ఫ ఆర్‌యూలో వీసీ వి.వెంకట బసవరావు ఆధ్వర్యంలో నిర్వహిం చారు. రెక్టార్ ఎన్ టీకే నాయక్, పరీక్షల కంట్రోలర్ డాక్టర్ ఎన్ వెంకటేశ్వర్లు సుందరానందపుచ్చా, భరత్ కుమార్, శ్రీనివాసులు, పాల్గొన్నారు. క్లస్టర్ వర్శిటీ ఇన్‌చార్జి రిజిష్ట్రార్ జీ.శ్రీనివాస్ ఆధ్వర్యంలో గేయాన్ని ఆలపించారు.
కొండారెడ్డి బురుజు వద్ద ఎన్ సీసీ ఆధ్వర్యంలో ..
ఎన్ సీసీ 28వ బెటాలియన్ అపీసర్, లెప్టినెంట్ కల్నల్ శశికుమార్ ఆధ్వర్యంలో కొండారెడ్డి బురుజు వద్ద పరేడ్ నిర్వహించారు. 375 మంది ఎన్ సీసీ క్యాడెట్లు, ఎన్ సీసీ ఆఫీసర్లు మహేంద్ర, ఆర్ క్లామిక్ నాయక్, వివిధ ఎన్ సీసీ ఆఫీసర్లుపాల్గొన్నారు.
వందేమాతరం ఆత్మవిశ్వాస నినాదం
కర్నూలు న్యూసిటీ: వందేమాతరం గీతం ప్రతి భారతీయుడులో ఆత్మవిశ్వాసం నింపుతుందని నగర పాలక అడిషనల్ కమిషనర్ ఆర్‌జీవి.కృష్ణ అన్నారు. గీతం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్బంగా శుక్రవారం కార్యాలయంలో ఉద్యోగులు వందేమాతరం గేయాన్ని ఆలపించారు. మేనేజర్ చిన్నరాముడు, అకౌంట్స్ ఆఫీసర్ చుండీప్రసాద్, ఆర్‌వో జునైద్, డీఎస్‌ఓ క్రిష్ణమోహన్, సిబ్బంది శ్రీదేవి, శోభారాణి, సరస్వతి, నాగరాజు, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
ఫ జడ్పీ మినీ సమావేశ భవనంలో గేయాన్ని ఆలపించారు. జడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, సీఈఓ జి.నాసరరెడ్డి, డిప్యూటి సీఈఓ వెంకటసుబ్బారెడ్డి, జడ్పీటీసీలు, అధికారులు, పాల్గొన్నారు.
సి.బెళగల్: తహసీల్దార్ వెంకటలక్ష్మి ఎస్‌ఐ వేణుగోపాల్‌రాజు ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి పూలమాల వేశారు. రీసర్వే డీటీ వెంకటే శ్వర్లు, వీఆర్వో లు, టీడీపీ నాయకుడు జగదీశ్వరరెడ్డి, బాలాజివెంకటేశ్, లక్ష్మన్న ఉన్నారు.
ఓర్వకల్లు: మండలంలోని ఓర్వకల్లు, హుశేనాపురం, నన్నూరు, ఉయ్యాలవాడ, ఉప్పలపాడు తదితర గ్రామాల్లో వందేమాతరం గీయాన్ని విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆలపించారు.
కర్నూలు ఎడ్యుకేషన్: బి.క్యాంపు ప్రభుత్వ ఒకేషనల్ జూనియర్ కళాశాలలో శుక్రవారం ప్రిన్సిపాల్ నాగస్వామి నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించారు. అధ్యాపకులు ప్రసన్న కుమార్, రామకృష్ణ పాల్గొన్నారు.
కల్లూరు: పౌరులకు వందేమాతరం గేయం ఆత్మవిశ్వాసం నింపుతుందని విద్యుత్ ఆపరేషన్ సర్కిల్ ఎస్‌ఈ ఆర్.ప్రదీప్‌కుమార్ అన్నారు. శుక్రవారం విద్యుత్తుభవన్‌లో ఉద్యోగులతో కలిసి గేయాన్ని ఆలపించారు.
కర్నూలు కల్చరల్: వందేమాతరం గీతం ఉ్సతవాలను ఏడాది పాటు నిర్వహించాలని విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురారి శంకరప్ప కోరారు. శుక్రవారం రోజావీధిలో జాతీయ జెండా ప్రదర్శన నిర్వహించారు. మహిళా సంఘం సభ్యులు మీసాల సుమలత, శేషమ్మ, నారాయణమ్మ, చిట్టెమ్మ, నాగమద్దమ్మ పాల్గొన్నారు.
కర్నూలు హాస్పిటల్: స్వాతంత్ర సమరానికి వందేమాతరం ప్రేరణ అని ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ డా.కే.వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం వైద్యులు, సిబ్బంది వందేమాతరం గేయాలపన చేశారు. ఆర్‌ఎంవో టీసీహెచ్ వెంకటరమణ, అడ్మినిస్ర్టేషన్ విభాగపు అసోసియేట్ ప్రొఫెసర్ డా.శివబాల, అసిస్టెంట్ ప్రొపెసర్ డా.కిరణ్ కుమార్ ఎమర్జెన్సీ మెడిసిన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.సుబ్రహ్మణ్యం, నర్సింగ్ సూపరింటెండెంట్ ఎస్‌పీ సావిత్రీబాయి పాల్గొన్నారు. వైద్య కళాశాలలో ప్రిన్సిపాల్ డా.కే.చిట్టినరసమ్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. వైస్ ప్రిన్సిపాల్ డా.సింధియా శుభప్రధ అనాటమి, బయో కెమిస్ర్టీ హెచ్‌వోడీలు డా.శోభాదేవి, డా.కిరణ్మయి, వైద్య అద్యాపకులు డ.కృష్ణమోహన్, డా.సోమశేఖర్ పాల్గొన్నారు.