Share News

వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి : డీఈవో

ABN , Publish Date - Dec 27 , 2025 | 11:32 PM

పది పరీక్షలో వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యా యులు ప్రణాళిక రచించుకోవాలని డీఈవో ఎల్‌. సుధాకర్‌ అన్నారు.

వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి : డీఈవో
ఉపాధ్యాయులతో మాట్లాడుతున్న డీఈవో

కోడుమూరు, డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి): పది పరీక్షలో వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యా యులు ప్రణాళిక రచించుకోవాలని డీఈవో ఎల్‌. సుధాకర్‌ అన్నారు. స్థానిక జడ్పీ ఉన్నత బాలుర, బాలిక పాఠశా లను శనివారం సందర్శించారు. పదో తరగతి విద్యార్థు లకు 100 రోజులు ప్రణాళికలో భాగంగా విద్యార్థులకు ని ర్వహించిన పరీక్షలను ఆయన తనిఖీ చేశారు. జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో ఆయన సందర్శనలో విద్యా ర్థులకు ఎలాంటి విద్యా బోధన అందిస్తున్నారని ప్రధానో పాధ్యాయుడు రామచంద్రుడును డీఈవో అడిగి తెలుసుకు న్నారు. అనంతరం విద్యార్థుల పరీక్ష పేపర్లును ఆయన పరిశీలించారు. డీఈవో వెంట ఎంపీడీవో రాముడు, ఎంఈవో రామచంద్రుడు ఉన్నారు.

Updated Date - Dec 27 , 2025 | 11:32 PM