హుషారుగా..
ABN , Publish Date - Jun 22 , 2025 | 11:46 PM
ఒలింపిక్ డే సంబరాల ముగింపు సందర్భంగా నిర్వహించిన క్రీడా జ్యోతి పరుగు హుషారుగా సాగింది.
కనువిందుగా క్రీడాజ్యోతి పరుగు
నిర్వాహకుల కృషి ప్రశంసనీయం
జిల్లా ప్రధాన న్యాయాధికారి జి.కబర్ది
ఘనంగా ముగిసిన ఒలింపిక్ డే సంబరాలు
ఆకట్టుకున్న విద్యార్థినుల నృత్యాలు
కర్నూలు స్పోర్ట్స్, జూన్ 22 (ఆంధ్రజ్యోతి): ఒలింపిక్ డే సంబరాల ముగింపు సందర్భంగా నిర్వహించిన క్రీడా జ్యోతి పరుగు హుషారుగా సాగింది. ఆది వారం స్థానిక కలెక్టరేట్ నుంచి ప్రారంభమై కొండారెడ్డి బురుజు వరకు కనువిందుగా క్రీడాజ్యోతి పరుగు క్రీడా విజేతల బహుమ తులతో ఘనంగా ముగిసింది. ఈపరుగులో క్రీడాజ్యోతి చేతపట్టిన జిల్లా ప్రధాన న్యాయాధికారి జి.కబర్ది మాటా ్లడుతూ నిర్వాహకుల కృషి అభినంద నీయమన్నారు. ఇలాంటి కార్యక్రమానికి పోలీసు యంత్రాంగం సహకరిం చడం సం తోషం కలిగిస్తుందన్నారు. విద్యావేత్త డా.కేవీ సుబ్బారెడ్లి మాట్లాడుతూ ఆరోగ్యమే మహా భాగ్యం అన్న నానుడికి ఈనాటి క్రీడాకారుల పరుగు చక్కటి ఉదాహ రణ అని అన్నారు. కర్నూలు నుంచి ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు కృషిచేస్తున్న క్రీడా సంఘాలను డీఎస్పీ మహబూబ్‌బాషా ప్రశంసించారు. జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు రామాం జనేయులు మాట్లాడుతూ క్రీడా సంఘాల ప్రతినిధులు, వ్యాయామ ఉపాధ్యాయుల సహకారంతో పది రోజుల పాటు చిన్నారుల కు 25 క్రీడాంశాలలో పోటీలు నిర్వహించామన్నారు. తమకు సహకరించిన స్పోర్ట్స్ వారికి పోలీసు శాఖకు, క్రీడాపో షకులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలి పారు. స్పోర్ట్స్ ప్రమోటర్, అడ్వకేట్ శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలకు తమ సహాయ సహకారాలు ఉంటా యన్నారు. ట్రాఫిక్ సీఐ మన్సూరుద్దీన్ మాట్లాడుతూ క్రీడాకారుల రాణింపునకు క్రీడా సంఘాలు, తల్లిదండ్రులు సహకరించాలన్నారు. దిన్నె దేవరపాడు ఏపీఎస్‌డబ్ల్యూఆర్ విద్యార్థినులు చేసిన నృత్యాలు చూపరులను ఆకట్టుకు న్నాయి. కార్యక్రమంలో జిల్లా ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ సభ్యులు గుడిపల్లి సురేందర్, ఏపీ హ్యాండ్ బాల్ అసోసి యేషన్ ప్రధాన కార్యదర్శి సి.శ్రీనివాసులు, రాష్ట్ర కరాటే అసోసి యేషన్ అధ్యక్షుడు కోలా ప్రతాప్, తైక్వాండో జిల్లా సంయుక్త కార్యదర్శి వెంకటేశ్వర్లు, మా స్టర్ స్విమ్మింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు జయలక్ష్మి నారాయణ రెడ్డి, బార్ అసోసి యేషన్ అద్యక్షులు హరినాథ్, జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ కార్యదర్శి హర్షవర్దన్, హాకీ అసోసియేషన్ కార్యదర్శి దాసరి సుధీర్ తదితరులు పాల్గొన్నారు.