ఆర్‌అండ్‌బీ రోడ్లకు మోక్షం
ABN , Publish Date - Aug 06 , 2025 | 11:27 PM
శ్రీశైలం నియోజకవర్గంలో ఆర్‌అండ్‌బీ రోడ్లకు మోక్షం లభించనుంది. ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లోని ఆర్‌అండ్‌బీ రోడ్లకు ఎండీఆర్ కింద నిధులు మంజూరు చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
రూ.2.20కోట్ల నిధులు మంజూరు
త్వరలో టెండర్లు స్వీకరణ
నంద్యాల, ఆగస్టు6(ఆంధ్రజ్యోతి): శ్రీశైలం నియోజకవర్గంలో ఆర్‌అండ్‌బీ రోడ్లకు మోక్షం లభించనుంది. ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లోని ఆర్‌అండ్‌బీ రోడ్లకు ఎండీఆర్ కింద నిధులు మంజూరు చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలోని శ్రీశైలం నియోజకవర్గంలోని రెండు రోడ్లకు రూ.2.20 కోట్ల నిధులు మంజూరు చేసింది. పాములపాడు మండల పరిధిలోని మద్దూరు- వెలుగోడు మండల పరిధిలోని రేగడగూడురు మద్యలోని ఐదు కిలోమీటర్లు తారురోడ్డును (బీటీరోడ్డు) ఆయా నిధులతో వేయనున్నారు. ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి స్వగ్రామం వెలుగోడు మండలం వేల్పనూరు గ్రామంలో 600 మీటర్లు దెబ్బతిన్న సిమెంట్‌రోడ్డును వేయనున్నారు. కొన్ని నెలలుగా ఆయా రోడ్లు అధ్వానస్థితిలో ఉండటంతో ఆయా రహదారుల గుండా రాకపోకలు సాగించడం ఇబ్బందిగా మారింది. గతంలో ఆయా రోడ్ల దుస్థితిపై ‘ఆంధ్రజ్యోతి’లో కథనాలు కూడా ప్రచురించిన విషయం తెలిసిందే. ఏది ఏమైనా తాజాగా ప్రభుత్వం ఆయా రోడ్లకు రూ.2.20కోట్లు నిధులు మంజూరు ఆ ప్రాంత వాసులకు రోడ్డు సమస్య తప్పనుంది. త్వరలోనే టెండర్లు స్వీకరించి త్వరిగతిన ఆయా రోడ్ల పనులను ఆశాఖ అధికారులు పూర్తి చేయనున్నారు.