రక్తదానం ఆరోగ్యానికి మంచిది
ABN , Publish Date - Jun 14 , 2025 | 11:52 PM
రక్తదానం చేయడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని కలెక్టర్ పి. రంజిత్ బాషా అన్నారు.

ప్రాణాలను కాపాడే రక్తదానం
కలెక్టర్ పి. రంజిత్ బాషా
రక్తదాతలకు, స్వచ్ఛంద సంస్థలకు సర్టిఫికెట్ల అందజేత
ఘనంగా ప్రపంచ రక్తదాన దినోత్సవం
కర్నూలు హాస్పిటల్, జూన్ 14 (ఆంధ్రజ్యోతి): రక్తదానం చేయడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని కలెక్టర్ పి. రంజిత్ బాషా అన్నారు. శనివారం నగరంలోని రెడ్‌క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంకు ఆవరణంలో వైద్య ఆరోగ్యశాఖ, జిల్లా రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రపంచ రక్తదాన దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కలెక్టర్, డీఎంహెచ్‌వో డా.పి.శాం తికళ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తదానం ఒక నిండు ప్రాణాన్ని కాపాడుతుందన్నారు. జిల్లాలో 45వేలు యూనిట్ల రక్తం అవసరం కాగా, 35వేల యూనిట్ల రక్తం మాత్రమే రక్తదాతల నుంచి వస్తుందని, ఇంకా 10వేల యూనిట్ల రక్తం కొరత ఉందన్నారు. వచ్చే ఏడాది ఈకొరతను అధిగమించాలని జిల్లా రెడ్‌క్రాస్ సొసైటీ చైర్మన్ డా.కేజీ గోవిందరెడ్డిని ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లాలో రక్తదానం చేసిన విద్యాసంస్థలు, ఎన్జీవోలు, రెడ్‌క్రాస్ సభ్యులను కలెక్టర్ సర్టిఫికెట్లను అందజేశారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు కే.అ రుణ, మధుసూదన్, ప్రభాకర్ రెడ్డి, భీమశంకర్ రెడ్డి, కేవీ సుబ్బారెడ్డి, రెడ్‌క్రాస్ మాజీ చైర్మన్ జి.శ్రీనివాసులు, జిల్లా కోశాదికారి రఘునాథరెడ్డి, సెక్రటరీ వెంకట కృష్ణుడు తదితరులు పాల్గొన్నారు.