బంగారు అంబారీపై ప్రహ్లాదరాయలు
ABN , Publish Date - Jun 14 , 2025 | 11:50 PM
మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠంలో ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలు బంగారు అంబారీపై భక్తులకు దర్శనం ఇచ్చారు.

మంత్రాలయం, జూన్ 14(ఆంధ్రజ్యోతి): మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠంలో ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలు బంగారు అంబారీపై భక్తులకు దర్శనం ఇచ్చారు. శనివారం జ్యేష్ఠ మాస తదియ శుభదినాన్ని పురస్కరించుకుని శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థుల ఆధ్వర్యంలో తెల్లవారుజాము నుంచే రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి, మంచాలమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బంగారు, వెండి, పట్టువస్రాలు, ప్రత్యేక పుష్పాలతో చూడముచ్చటగా అలంకరించారు. వేద పండితుల మంత్రోచ్చరణాలు, మంగళ వాయిద్యాల మధ్య వెండి గజవాహనంపై స్వర్ణ అంబారీలో ప్రహ్లాదరాయలను అధిష్ఠించి పీఠాధిపతి మహా మంగళ హారతితో ఆలయ ప్రాంగణం చుట్టూ ఊరేగించారు. రెండో శనివారం, ఆదివారం సెలవు దినాలు కావటంతో దక్షిణాది రాష్ర్టాలైన ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు నుంచి వే లాది మంది భక్తులు తరలివచ్చారు.