మాట నిలుపుకున్న ప్రభుత్వం
ABN , Publish Date - Jun 14 , 2025 | 11:49 PM
: తల్లికి వందనం పథకం అమలు చేసి కూటమి ప్రభుత్వం మాట నిలుపుకుందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి అన్నారు.

టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి
కర్నూలు అర్బన్, జూన్ 14(ఆంధ్రజ్యోతి): తల్లికి వందనం పథకం అమలు చేసి కూటమి ప్రభుత్వం మాట నిలుపుకుందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి అన్నారు. శనివారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాల యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత సార్వత్రిక ఎన్నికల ముందు సూపర్ సిక్స్ పథకాలను ప్రకటించి, అధికారం లోకి రాగానే చంద్రబాబు అమలు చేశారని కొనియాడారు. తల్లికి వందనం పేరుతో ప్రతి తల్లికి సంతానంలో ఎంత మందిని చదివిస్తూ ఉంటే అంత మందికి ఒక్కొక్కరికి రూ.13వేలు బ్యాంక్ ఖాతాలో జమ చేసి కూట మి ప్రభుత్వం వాగ్దానం నిలుపుకున్నదని అన్నారు. వైసీపీ నాయకులు ఇది జీర్ణించుకోలేక తప్పుడు ప్రచారాలకు తెగబడుతున్నారని మండిపడ్డారు. వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి రైతులపై కపట ప్రేమ నటిస్తూ పొగాకు రైతులను పరామర్శించేందుకు పొదిలికి వెళ్లి కుట్రపూరితంగా అల్లుర్లు సృష్టించేందుకు చేసిన ప్రయత్నం వికటించిందని తెలిపారు. ఇందులో కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, కాసాని మహేష్ గౌడ్, సత్రం రామకృష్ణ, పుల్లయ్యచౌదరి, డీ.జేమ్స్ పాల్గొన్నారు.