యోగాతో మానసిక ఉల్లాసం
ABN , Publish Date - Jun 14 , 2025 | 11:47 PM
ప్రతి రోజు యోగా చేస్తే మానసిక ఉల్లాసం కలుగుతుందని కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు.

కలెక్టర్ రాజకుమారి
నంద్యాల టౌన్/ హాస్పిటల్, జూన్14 (ఆంధ్రజ్యోతి): ప్రతి రోజు యోగా చేస్తే మానసిక ఉల్లాసం కలుగుతుందని కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు. శనివారం స్థానిక పద్మావతి నగర్ ఇండోర్ స్టేడియంలో పురపా లక సంఘం ఆధ్వర్యంలో ఈనెల 21 న జరిగే అంతర్జాతీయ యోగా దినోత్స వాన్ని పురస్కరించుకుని యోగా డెమో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమెతో పాటు జేసీ విష్ణుచరణ్ పాల్గొన్నారు. ముందుగా జ్యోతిని వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. యోగాతో చాలా ప్రయోజనాలు ఉన్నాయన్నారు. యో గాను ప్రతి ఒక్కరు జీవితంలో భాగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉన్నతాధికారులు, యోగా గురువులు, సాధకులు పాల్గొన్నారు.