Kurnool : చదువుల తల్లి.. ఇక లేదు!
ABN , Publish Date - Mar 03 , 2025 | 01:43 AM
కర్నూలు జిల్లా సి.బెళగల్ మండలం పోలకల్ జిల్లా పరిషత్ హైస్కూల్‌లో రెండ్రోజుల క్రితం చెట్టువిరిగి పడిన ఘటనలో తీవ్రంగా గాయపడిన 8వ తరగతి విద్యార్థిని శ్రీలేఖ(14) కర్నూలు జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూసింది
కర్నూలు హాస్పిటల్, మార్చి 2 (ఆంధ్రజ్యోతి): చదువుల్లో చురుగ్గా ఉండే ఓ విద్యార్థిని అర్ధాంతరంగా కన్నుమూసింది. కర్నూలు జిల్లా సి.బెళగల్ మండలం పోలకల్ జిల్లా పరిషత్ హైస్కూల్‌లో రెండ్రోజుల క్రితం చెట్టువిరిగి పడిన ఘటనలో తీవ్రంగా గాయపడిన 8వ తరగతి విద్యార్థిని శ్రీలేఖ(14) కర్నూలు జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూసింది. పోలకల్ హైస్కూల్లో గత నెల 28న సైన్స్ డే వేడుకల సమయంలో ఆవరణలోని చెట్టు కూలడంతో శ్రీలేఖకు తీవ్రగాయాలయ్యాయి. అప్పటి నుంచి కర్నూలు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న ఆమె ఆదివారం తెల్లవారుజామున కార్డియాక్ అరెస్టుతో మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు.