Low Quality Onions: తాడేపల్లిగూడెం మార్కెట్‌కు కర్నూలు ఉల్లి
ABN , Publish Date - Sep 04 , 2025 | 03:22 AM
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మార్కెట్‌కు బుధవారం రెండు లారీల్లో కర్నూలు ఉల్లి వచ్చింది....
తాడేపల్లిగూడెం, సెప్టెంబరు 3(ఆంధ్రజ్యోతి): పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మార్కెట్‌కు బుధవారం రెండు లారీల్లో కర్నూలు ఉల్లి వచ్చింది. వీటిలో నాణ్యత తక్కువగా ఉన్న ఉల్లిని క్వింటా రూ.800కు, నాణ్యమైన ఉల్లిని రూ.1300కు కొనుగోలు చేశారు. వీటిలో మూడు టన్నులను మార్క్‌ఫెడ్ ద్వారా కిలో రూ.8.50 చొప్పున కొనుగోలు చేశారు. కర్నూలు ఉల్లి నాణ్యత లేకపోవడంతో కొనుగోలు చేయడానికి వ్యాపారులు ముందుకు రావడం లేదు. దీంతో రీజనల్, జిల్లాస్థాయి అధికారులు వ్యాపారులతో చర్చలు జరిపారు. ఉల్లిని కొనుగోలు చేసి, కర్నూలు రైతులను ఆదుకోవాలని వ్యాపారులకు చెప్పారు.