కర్నూలు జిల్లాకు సంజీవయ్య పేరు పెట్టాలి
ABN , Publish Date - Feb 15 , 2025 | 12:08 AM
కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య పేరు పెట్టాలని మాలమహానాడు నాయకులు డిమాండ్ చేశారు.

బనగానపలె, ఫిబ్రవరి 14 ( ఆంధ్రజ్యోతి): కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య పేరు పెట్టాలని మాలమహానాడు నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం దామోదరం సంజీవయ్య జయంతి సం దర్భంగా పట్టణంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళు లర్పించారు.కార్యక్రమంలో మాలమహానాడు నాయకులు దస్తగిరి, మా రం నాగరాజు, మద్దిలేటి, స్వామి దాసు, ముక్కమళ్ల బెన్నీ, ఓబులేసు, శ్రీనివాసులు, ఓబన్న తదితరులు పాల్గొన్నారు.
శిరివెళ్ల : దివంగత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య సేవలు చిరస్మరణీయమని ఎంపీడీవో శివ మల్లేశ్వరప్ప అన్నారు. దామోదరం సంజీవయ్య జయంతి సందర్భంగా శిరివెళ్లలోని ఎంపీడీవో కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి శుక్రవారం ని వాళి అర్పించారు. కార్యక్రమంలో ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది, ఉపాధిహామీ పథకం సిబ్బంది పాల్గొన్నారు.
డోన రూరల్: పట్టణంలోని ఆర్‌అండ్‌బీ గెస్టు హౌస్‌లో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో దామోదరం సంజీవయ్య జయంతిని ఘనంగా నిర్వహిం చారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కా ర్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వలసల రామకృష్ణ, మండల కార్య దర్శి వెంకటనాయునిపల్లె శ్రీనివాసులు , నాయకులు వలసల బాలుడు, గుండాల ఈశ్వరయ్య, గురిమిట్ల నారాయణ, గార్లపాటి మద్దిలేటి, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
డోన టౌన: పట్టణంలోని స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో జి.వెంకటేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ తొలి దళిత ము ఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జయంతిని ఘనంగా ని ర్వ హించారు. దామోదరం సంజీవయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఈవోఆర్‌డీ ఫకృద్దీన సాహేబ్, సీని యర్ సూపరింటెండెంట్ కాశీ విశ్వనాథ్, సిబ్బంది పాల్గొన్నారు.