Share News

కావలి గ్రీష్మపై వైసీపీ తప్పుడు ప్రచారం

ABN , Publish Date - Mar 11 , 2025 | 01:07 AM

కావలి గ్రీష్మను సీఎం చంద్రబాబునాయుడు ఎమ్మెల్సీ అభ్యర్ధిగా ప్రకటించటాన్ని వైసీపీ జీర్ణించుకోలేక తప్పుడు ప్రచారం చేస్తోందని టీడీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు చింతపల్లి వెంకటేశ్వరరావు ఆరోపించారు.

 కావలి గ్రీష్మపై వైసీపీ తప్పుడు ప్రచారం

టీడీపీ నేత చింతపల్లి వెంకటేశ్వరరావు

తోట్లవల్లూరు, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): ఉన్నత విద్యావంతురాలైన కావలి గ్రీష్మను సీఎం చంద్రబాబునాయుడు ఎమ్మెల్సీ అభ్యర్ధిగా ప్రకటించటాన్ని వైసీపీ జీర్ణించుకోలేక తప్పుడు ప్రచారం చేస్తోందని టీడీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు చింతపల్లి వెంకటేశ్వరరావు ఆరోపించారు. వల్లూరుపాలెంలో సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నేరస్వభావం కలిగిన వైసీపీకి అందరూ అలాగే కనిపిస్తుంటారని అన్నారు. గ్రీష్మ కుటుంబానికి ఎం తో గౌరవప్రదమైన చరిత్ర ఉందని, ఆమె తల్లి ప్రతిభాభారతి స్పీకర్‌ గా పనిచేశారని, ఉన్నత విద్యావంతురాలైన గ్రీష్మ ఎమ్మెల్సీ కావటానికి అన్ని అర్హతలు ఉన్నాయని ఆయన అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో మహిళలపై అత్యాచారాలు, అరాచకాలను జగన్‌ పట్టించుకోకపోవడాన్ని టీడీపీ మహానాడులో గ్రీష్మ ప్రశ్నించారని, దానిని వైసీపీ వక్రీకరించటం దారుణమని అన్నారు. దళిత డ్రైవర్‌ను చంపి డోర్‌ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ అనంతబాబును నెత్తిన పెట్టుకుని పాలాభిషేకాలు చేసిన ఘనత, దళిత డాక్టర్‌ను పిచ్చోడిని చేసి చంపిన ఘనత వైసీపీదేనని, ఇలాంటి వైసీపీ పెద్దలకు కావలి గ్రీష్మ గురించి మాట్లాడే నైతిక అర్హత లేదని వెంకటేశ్వరరావు అన్నారు. పీఏసీఎస్‌ మాజీ అధ్యక్షుడు ఆచంటి కోటిబాబు, బీసీ నాయకుడు ఏమినేని వెంకటేశ్వరరావు, సీహెచ్‌ పుల్లయ్య పాల్గొన్నారు.

Updated Date - Mar 11 , 2025 | 01:07 AM