ఘనంగా ప్రపంచ అనాటమీ దినోత్సవం
ABN , Publish Date - Oct 17 , 2025 | 12:31 AM
ప్రభుత్వ సిద్ధార్థ మెడికల్ కాలేజీలో ప్రపంచ అనాటమీ దినోత్సవం గురువారం ఘనంగా జరిగాయి. కళాశాల అనాటవీ విభాగం ఆధ్వర్యంలో జరిన ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ ఎ.ఏడుకొండలు పాల్గొని అనాటమీ దినోత్సవ విశిష్టతను విద్యార్థులకు వివరించారు.
ఘనంగా ప్రపంచ అనాటమీ దినోత్సవం
ప్రభుత్వాసుపత్రి, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ సిద్ధార్థ మెడికల్ కాలేజీలో ప్రపంచ అనాటమీ దినోత్సవం గురువారం ఘనంగా జరిగాయి. కళాశాల అనాటవీ విభాగం ఆధ్వర్యంలో జరిన ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ ఎ.ఏడుకొండలు పాల్గొని అనాటమీ దినోత్సవ విశిష్టతను విద్యార్థులకు వివరించారు. మానవ శరీర నిర్మాణ శాస్త్ర పితామహుడు ఆండ్రియాస్ వెసాలియస్ జ్ఞాపకార్ధం ఈ దినోత్సవాన్ని ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటారని గుర్తు చేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని విద్యార్థులు కళాశాల ప్రాంగణాన్ని రంగోలితో అలంకరించారు. పోస్టర్ మేకింగ్, మోడల్ మేకింగ్ పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని ప్రతిభ కనబర్చారు. చివరిగా మృతదేహాల బలిదానాలను గౌరవిస్తూ, వాటిని జీవితాంతం కృతజ్ఞతతో గుర్తుంచుకుంటామని ప్రతిజ్ఞ చేశారు.