Share News

జోరువాన

ABN , Publish Date - Oct 24 , 2025 | 01:09 AM

నగరంలో గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి జనజీవనం అస్తవ్యస్తమైంది. రహదారులు జలమయమయ్యాయి. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

జోరువాన
బందరురోడ్డులో..

జిల్లావ్యాప్తంగా విస్తారంగా వర్షాలు

నగరంలో జనజీవనం అస్తవ్యస్తం

జలమయమైన రహదారులు

విజయవాడ, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి) : నగరంలో గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి జనజీవనం అస్తవ్యస్తమైంది. రహదారులు జలమయమయ్యాయి. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కేవలం నగరంలోనే 109.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉదయం నుంచి కురిసిన వర్షానికి ఆటోనగర్‌, కానూరు, మాచవరం, గుణదల, పటమటలంక, బెంజిసర్కిల్‌, ఏలూరు రోడ్డు, ఎంజీ రోడ్డు, సింగ్‌నగర్‌, విద్యాధరపురం, పీఎన్‌బీఎస్‌ జలమయమయ్యాయి. ఎక్కడికక్కడ డ్రెయినేజీలు నిండిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో మోకాలి లోతు వరకు నీరు చేరింది.

వర్షపాతం వివరాలు

జిల్లాలో అత్యధికంగా విజయవాడ తూర్పులో 24.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యల్పంగా వత్సవాయిలో 1.5 మి.మీ వర్షపాతం నమోదైంది. విజయవాడ పశ్చిమ 22.8 మి.మీ, విజయవాడ ఉత్తరం 21.3, విజయవాడ సెంట్రల్‌ 21.0, ఏ.కొండూరు 20.8, విజయవాడ రూరల్‌ 17.5, తిరువూరు 11.5, మైలవరం 6.5, కంచికచర్ల 6.3, వీరులపాడు 6.0, నందిగామ 5.3, ఇబ్రహీంపట్నం 5.3, జి.కొండూరు 3.3, జగ్గయ్యపేట 2.5, పెనుగంచిప్రోలు 1.8 మి.మీ వర్షపాతం నమోదైంది. గంపలగూడెం, రెడ్డిగూడెం, విస్సన్నపేట మండలాల్లో వర్ష ప్రభావం కనిపించలేదు.

Updated Date - Oct 24 , 2025 | 01:09 AM