తాడిగడపను అభివృద్ధి పథంలో నడుపుతాం
ABN , Publish Date - May 13 , 2025 | 12:39 AM
తాడిగడప మునిసిపాలిటీని అభివృద్ధి పథంలో నడపడానికి శత విధాలా ప్రయత్నిస్తున్నామని, మునిసిపాలిటీలో రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణాలకు ప్రఽథమ ప్రాధాన్యం ఇస్తున్నామని ఎమ్మెల్యే బోడె ప్రసాద్ తెలిపారు.
మౌలిక సదుపాయాల కల్పనకు తొలి ప్రాధాన్యమిస్తున్నాం: ఎమ్మెల్యే బోడె ప్రసాద్
పెనమలూరు, మే 12 (ఆంధ్రజ్యోతి): తాడిగడప మునిసిపాలిటీని అభివృద్ధి పథంలో నడపడానికి శత విధాలా ప్రయత్నిస్తున్నామని, మునిసిపాలిటీలో రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణాలకు ప్రఽథమ ప్రాధాన్యం ఇస్తున్నామని ఎమ్మెల్యే బోడె ప్రసాద్ తెలిపారు. పోరంకిలోని శ్రీనివాసనగర్‌లో రూ.14.2లక్షల సాధారణ నిధులతో నిర్మించనున్న డ్రెయిన్‌కు సోమవారం ఆయన శంకుస్థాపన చేశారు. నిధుల లేమి వేధిస్తున్నా నియోజకవర్గంలో మౌలిక సదుపాయాల కల్పనకు తొలి ప్రాధాన్యం ఇస్తున్నామని ఆయన తెలిపారు. టీడీపీ తాడిగడప మునిసిపాలిటీ అధ్యక్షుడు అనుమోలు ప్రభాకరరావు, జనసేన నేత తాతపూడి గణేష్, కుర్రా నరేంద్ర, పీతా గోపీచంద్, యేనుగ శ్రీనివాస్ పాల్గొన్నారు.