ప్రభుత్వ స్థలాలను కబ్జా కానివ్వం
ABN , Publish Date - Apr 17 , 2025 | 01:03 AM
ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురికాకుండా పరిరక్షిస్తామని ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు.
పాయకాపురం, ఏప్రిల్ 16 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురికాకుండా పరిరక్షిస్తామని ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. పాయ కాపురం కండ్రిక కాలనీ సమీపంలో వైసీపీ హయాంలో కబ్జాకు గురైన ప్రభుత్వ స్థలంలో గోశాల నిర్మాణానికి బొండా ఉమా బుధవారం శంకుస్థాపన చేశారు. సుమా రు రూ.20లక్షలతో గోశాలను నిర్మిస్తామని స్థానికులకు హామీ ఇచ్చారు. నియోజకవర్గంలోని ప్రభుత్వ స్థలాలను గుర్తించి ప్రహరీలు నిర్మించడం, ఫెన్సింగ్‌లు వేయించ డంతో పాటుగా ప్రభుత్వ అవసరాలకు వినియోగిస్తామని తెలిపారు. కాకొల్లు రవికుమార్, పలగాని శివ, కోరాడ రమణ, పలగాని భాగ్యలక్ష్మి, బాబ పాల్గొన్నారు.
దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాం
నియోజకవర్గంలో దీర్ఘకాలిక ఇళ్ల పట్టాల సమస్యను పరిష్కరించామని ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. పాయకాపురం 62వ డివిజన్‌లో ఇళ్ల పట్టాలకు దరఖాస్తు చేసుకున్న పలువురు లబ్ధిదారులకు బుధవారం అజితసింగ్‌నగర్‌లోని టీడీపీ సెంట్రల్ కార్యాలయంలో పట్టాల పంపిణీ చేశారు. మహిళలను ఎమ్మెల్యేను సత్కరించారు. డివిజన్‌కు చెందిన రంగారావుకు రూ. 61 వేల సీఎంఆర్‌ఎఫ్ చెక్కును అందజేశారు. అనంతరం 62వ డివిజన్ తెలుగుదేశం పార్టీ డివిజన్ నూతన కమిటీలో అధ్యక్షుడిగా కేబుల్ రాజా, కార్యదర్శిగా మరియబాబు, ఇన్‌చార్జిగా పైడి శ్రీనులను నియమించారు. కార్యక్రమాల్లో ఘంటా కృష్ణమోహన్, సాంబశివరావు, పైడి తులసి, శీఖాకొల్లి జఠాధర్, ఆరుమళ్ల గోపిరెడ్డి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.