Share News

పంచాయతీల పంచన.. ఎన్నాళ్లీ ఆవేదన

ABN , Publish Date - Dec 02 , 2025 | 01:05 AM

పేరుకే గ్రామాలైనా అవి ఇతర పంచాయతీలకు అనుబంధంగా ఉంటాయి. ఈ కారణంగా అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్నాయి. రోడ్లు, డ్రెయిన్లు, వీధి దీపాలు, పారిశుధ్య నిర్వహణ వంటి కనీస మౌలిక సదుపాయాలకు కూడా నోచుకోవు. తమ ప్రాంతాలు పంచాయతీ పాలకవర్గాల చిన్నచూపునకు గురవుతున్నాయన్న ఆవేదనతో ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఠంచనుగా పన్నులు వసూలు చేస్తున్న పంచాయతీలు ఈ అనుబంధ గ్రామాలపై రూపాయి ఖర్చు పెట్టట్లేదు. పంచాయతీల పునర్విభజనపై నిషేధం ఎత్తివేస్తూ, పునర్నిర్మాణానికి వీలుగా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఉమ్మడి కృష్ణాజిల్లాలో దృష్టి సారించాల్సిన గ్రామాల పరిస్థితి ఇలా ఉంది. - (ఆంధ్రజ్యోతి, విజయవాడ)

పంచాయతీల పంచన.. ఎన్నాళ్లీ ఆవేదన
అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న జగ్గయ్యపేట మండలం రావిరాల గ్రామం

పంచాయతీల పునర్విభజన కోసం ఎదురుచూపులు

ఉమ్మడి కృష్ణాలో వందకు పైగా గ్రామాలు అనుబంధ జాబితాలో..

50కు పైగా గ్రామాలను పంచాయతీలుగా మార్చాలన్న డిమాండ్‌

వేరే పంచాయతీలకు అనుబంధం.. అభివృద్ధికి ప్రతిబంధకం..

పన్నులు చెల్లిస్తున్నా మౌలిక సదుపాయాలు లేక ఇబ్బందులు

15 గ్రామాలను పంచాయతీలుగా చేసే అవకాశం

పునర్విభజనపై నిషేధం ఎత్తివేత నేపథ్యంలో డిమాండ్లు

  • జగ్గయ్యపేట మండలం రావిరాల గ్రామం జయంతిపురం గ్రామానికి, గుండబోయినపాలెం గ్రామం బండిపాలెం గ్రామానికి అనుబంధంగా ఉన్నాయి. ఈ రెండు గ్రామాల్లో జనాభా వెయ్యికి పైగా ఉంది. శరవేగంగా విస్తరిస్తున్నప్పటికీ మౌలిక సదుపాయాల పరంగా పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. అభివృద్ధి ఆమడదూరంలో ఉంది. ఇదే మండలంలో అనుమంచిపల్లి పంచాయతీ పరిధిలోని గరికపాడు గ్రామాన్ని తక్కెళ్లపాడు పంచాయతీలో కలపాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు.

  • పెనుగంచిప్రోలు మండలం గుమ్మడిదుర్రు పంచాయతీలో వెల్దుర్తిపాడు అనుబంధంగా ఉంది. ఇక్కడ వెయ్యిమంది వరకు జనాభా నివసిస్తున్నారు. యాదవ సామాజికవర్గం ఎక్కువ. వెంకటాపురం పంచాయతీలో పొన్నవరం

  • వీరులపాడు మండలం చెన్నారావుపాలెం పంచాయతీలో తిమ్మాపురం, రంగాపురం గిరిజన గ్రామాలు అనుబంధంగా ఉన్నాయి. ఈ రెండు గ్రామాల్లో 300కు మించి జనాభా లేదు. వీటిని గిరిజన ప్రత్యేక పంచాయతీలు చేయాలన్న డిమాండ్‌ వస్తోంది. నిబంధనల ప్రకారం సాఽధ్యం కాకపోతే.. రంగాపురాన్ని జుజ్జూరు, తిమ్మాపురాన్ని దుగ్గిరాలపాడు పంచాయతీలో విలీనం చేయాలన్న డిమాండ్‌ వస్తోంది. గ్రామం అనుబంధంగా ఉంది. ఇక్కడ ఎస్సీలు ఎక్కువ. ఈ రెండు గ్రామాల్లో సరైన రోడ్లు, డ్రెయిన్లు లేవు.

  • జి.కొండూరు మండలం వెల్లటూరు పంచాయతీలో సీతారామపురం, భీమవరప్పాడు గ్రామాలు అనుబంధంగా ఉన్నాయి. ఇక్కడ అభివృద్ధి ఊసే లేదు. మౌలిక సదుపాయాలు అత్యంత దారుణం. ఈ రెండు పంచాయతీలను ఒకటిగా కలపాలన్న డిమాండ్‌ వ్యక్తమవుతోంది. జి.కొండూరు పంచాయతీలో కొత్తూరు గొల్లగూడెం అనుబంధంగా ఉంది. ఈ గ్రామంలో వెయ్యికి పైగా గొల్లలు నివసిస్తున్నారు. తమ గ్రామాన్ని ప్రత్యేక పంచాయతీ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

గతంలోనే కొన్ని ప్రతిపాదనలు పంపాం..

మైలవరం నియోజకవర్గ పరిధిలోని కొన్ని గ్రామాలను ప్రత్యేక పంచాయతీలు చేయాలన్న దానికి సంబంధించి గతంలో కొన్ని ప్రతిపాదనలు రాగా, పరిశీలించి ప్రభుత్వానికి పంపించాం. ఇప్పుడు కూడా గ్రామాల నుంచి ప్రత్యేక పంచాయతీలు చేయాలని తీర్మానాలు వస్తే.. తప్పకుండా పరిశీలిస్తాం. రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తాం. - లక్ష్మీశ, కలెక్టర్‌

Updated Date - Dec 02 , 2025 | 01:05 AM