జననాథుడై..
ABN , Publish Date - Jun 28 , 2025 | 12:46 AM
విజయవాడ జగన్నాథస్వామి రథయాత్ర శుక్రవారం ఘనంగా జరిగింది. ఇస్కాన్ ఆధ్వర్యంలో విద్యాధరపురం లేబర్‌కాలనీ గ్రౌండ్ వద్ద నిర్వహించిన ఈ రథయాత్రకు ముందు కళాబృందాలు, దేశ, విదేశీ భక్తులు ఆనందోత్సాహాలతో కదలగా, యాత్ర స్వాతిరోడ్డు, శివాలయం సెంటర్, కుమ్మరిపాలెం సెంటర్, వన్‌టౌన్ రథం సెంటర్ మీదుగా సీతమ్మవారి పాదాల వరకూ చేరింది.
కోలాహలంగా విజయవాడ జగన్నాథస్వామి రథయాత్ర
విద్యాధరపురం, జూన్ 27 (ఆంధ్రజ్యోతి) : విజయవాడ జగన్నాథస్వామి రథయాత్ర శుక్రవారం ఘనంగా జరిగింది. ఇస్కాన్ ఆధ్వర్యంలో విద్యాధరపురం లేబర్‌కాలనీ గ్రౌండ్ వద్ద నిర్వహించిన ఈ రథయాత్రకు ముందు కళాబృందాలు, దేశ, విదేశీ భక్తులు ఆనందోత్సాహాలతో కదలగా, యాత్ర స్వాతిరోడ్డు, శివాలయం సెంటర్, కుమ్మరిపాలెం సెంటర్, వన్‌టౌన్ రథం సెంటర్ మీదుగా సీతమ్మవారి పాదాల వరకూ చేరింది. ఎమ్మెల్యే సుజనా చౌదరి, లైలా గ్రూపు సీఈవో గోకరాజు గంగరాజు ముఖ్య అతిథులుగా విచ్చేసి జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర ఆశీనులైన రథాన్ని ప్రారంభించారు. రథం ముందు ప్రాంతాన్ని బంగారం, వెండి చీపుర్లతో శుభ్రపరిచారు. అనంతరం స్వామివారికి ధూపదీప హారతులిచ్చి, 108 రకాల పిండివంటలతో భోగం సమర్పించారు. ఈ రథయాత్రకు అడుగడుగునా భక్తులు నీరాజనాలు పట్టగా, నిర్వాహకులు ప్రసాద వితరణ చేశారు.