Share News

హాస్టల్‌ నుంచి ఇద్దరు విద్యార్థులు పరారీ

ABN , Publish Date - Jul 03 , 2025 | 12:27 AM

తోట్లవల్లూరు మండలంలోని రెహాబత వలంటరీ హాస్టల్‌ నుంచి పరారైన కందుకూరి సూర్యప్రకాష్‌(13), కతిపోగు రాజ్‌కుమార్‌ (15)లను సీఐ వల్లభనేని పవన్‌ కిషోర్‌ బుధవారం తల్లిదండ్రులకు అప్పగించారు.

హాస్టల్‌ నుంచి ఇద్దరు విద్యార్థులు పరారీ

హాస్టల్‌ నుంచి ఇద్దరు విద్యార్థులు పరారీ

ఆటోనగర్‌లో పట్టుబడ్డ విద్యార్థులు

తల్లిదండ్రులకు అప్పగించిన పటమట పోలీసులు

బెంజిసర్కిల్‌, జూలై 2 (ఆంధ్రజ్యోతి): తోట్లవల్లూరు మండలంలోని రెహాబత వలంటరీ హాస్టల్‌ నుంచి పరారైన కందుకూరి సూర్యప్రకాష్‌(13), కతిపోగు రాజ్‌కుమార్‌ (15)లను సీఐ వల్లభనేని పవన్‌ కిషోర్‌ బుధవారం తల్లిదండ్రులకు అప్పగించారు. పోలీసుల వివరాల ప్రకారం ఏకమూరులోని రెహాబత వలంటరీ హస్టల్‌ నుంచి బుధవారం ఉదయం ఇద్దరు పిల్లలు అదృశ్యమైనట్లు తోట్లవల్లూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు అందింది. ఈ క్రమంలో విద్యార్థుల ఫొటోలను అన్నీ పోలీస్‌స్టేషన్‌లకు పంపించారు. బుధవారం ఆటోనగర్‌ ప్రాంతంలో సంచరిస్తున్న పిల్లల్ని పటమట పోలీసులు గుర్తించారు. దీంతో వారిని అదుపులోకి తీసుకుని వివరాలు సేకరించారు. హాస్టల్‌లో ఉండి చదువుకోవడం ఇష్టం లేక పారిపోయినట్లు పిల్లలు తెలిపారు. బుద్ధిగా చదువుకొని ప్రయోజకులవ్వాలని పిల్లలకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. అనంతరం తల్లిదండ్రులకు పిల్లలను అప్పగించారు.

Updated Date - Jul 03 , 2025 | 12:27 AM