తెలుగులో పరీక్షలు, మూల్యాంకనంపై 18 నుంచిశిక్షణ
ABN , Publish Date - Aug 07 , 2025 | 12:20 AM
పీబీ సిద్ధార్థ కళాశాల స్వర్ణోత్సవ సంవత్సర కార్యక్రమంగా సిద్ధార్థ తెలుగు శాఖ, మైసూ రులోని సీఐఐఎల్ (సెం ట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వే జెస్), నేషనల్ టెస్టింగ్ సర్వీస్ ఇండియా సంయుక్త సౌజన్యంతో తెలుగులో పరీక్షలు, మూల్యాంకనం, ప్రశ్నాంశ రచనపై ఈనెల 18 నుంచి 23 వరకు శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ మేకా రమేష్ తెలిపారు.
తెలుగులో పరీక్షలు, మూల్యాంకనంపై 18 నుంచిశిక్షణ
పీబీ సిద్ధార్థలో తెలుగు కార్యశాల వాల్‌పోస్టర్ ఆవిష్కరణ
విజయవాడ కల్చ రల్, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి) : పీబీ సిద్ధార్థ కళాశాల స్వర్ణోత్సవ సంవత్సర కార్యక్రమంగా సిద్ధార్థ తెలుగు శాఖ, మైసూ రులోని సీఐఐఎల్ (సెం ట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వే జెస్), నేషనల్ టెస్టింగ్ సర్వీస్ ఇండియా సంయుక్త సౌజన్యంతో తెలుగులో పరీక్షలు, మూల్యాంకనం, ప్రశ్నాంశ రచనపై ఈనెల 18 నుంచి 23 వరకు శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ మేకా రమేష్ తెలిపారు. బుధవారం కార్యశాల వాల్‌పోస్టర్‌ను ప్రిన్సిపాల్ మేకా రమేష్, డైరెక్టర్ వేమూరి బాబూరావు, తెలుగు సహాయక ఆచార్యులు డాక్టర్.ఎన్.శివకుమార్, డాక్టర్ పీబీడీవీ ప్రసాద్, డాక్టర్ వై.పూర్ణచంద్రరావు, డాక్టర్ కె.హేమబాంధవి, డాక్టర్ సశ్రీ ఆవిష్కరించారు. తెలుగు ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ఆచార్యులు, పరిశోధక విద్యార్థులు ఈనెల13 లోగా దరఖాస్తు చేసుకోవాలని, ఎంపికైన వారికి ఆన్ డ్యూటీ సదుపాయం, గౌరవ పారితోషికం, భత్యం అందిస్తామని, దరఖాస్తుకు 99898 44001 నెంబరులో సంప్రదించాలన్నారు