21 నుంచి అధ్యాపకులకు శిక్షణ
ABN , Publish Date - Jul 17 , 2025 | 12:40 AM
ఔషధ పంపిణీలో అవలంబించాల్సిన వ్యూహాలు, అమలు చేయాల్సిన సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కల్పించే నిమిత్తం కేవీఎస్‌ఆర్ సిద్ధార్థ ఫార్మశీ కళాశాల అధ్యాపకులకు ఈ నెల 21 నుంచి 27 వరకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ ఏ. సునీత తెలిపారు.
21 నుంచి అధ్యాపకులకు శిక్షణ
మొగల్రాజపురం, జూలై 16 (ఆంధ్రజ్యోతి): ఔషధ పంపిణీలో అవలంబించాల్సిన వ్యూహాలు, అమలు చేయాల్సిన సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కల్పించే నిమిత్తం కేవీఎస్‌ఆర్ సిద్ధార్థ ఫార్మశీ కళాశాల అధ్యాపకులకు ఈ నెల 21 నుంచి 27 వరకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ ఏ. సునీత తెలిపారు. బుధవారం కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ఇండియన్ ఫార్మాస్యూటికల్ అసోసియేషన్ సహకారంతో కళాశాల ఫార్మాస్యూటిక్స్ విభాగం పర్యవేక్షణలో ఈ శిక్షణ జరుగుతుందని తెలిపారు. డాక్టర్ జి. రమణ తదితరులు పాల్గొన్నారు.