Share News

సైనికులకు సంఘీభావంగా తిరంగా ర్యాలీ

ABN , Publish Date - May 15 , 2025 | 12:42 AM

ఆపరేషన్‌ సిందూర్‌ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడం దేశానికి గర్వకారణమని ఎంపీపీ రావి దుర్గావాణి అన్నారు.

సైనికులకు సంఘీభావంగా తిరంగా ర్యాలీ
మోపిదేవి ప్రధాన కూడలిలో భారీ జాతీయ జెండాతో నిర్వహిస్తున్న ర్యాలీ

మోపిదేవి, మే 14 (ఆంధ్రజ్యోతి): ఆపరేషన్‌ సిందూర్‌ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడం దేశానికి గర్వకారణమని ఎంపీపీ రావి దుర్గావాణి అన్నారు. సైనికులకు సంఘీభావంగా మండల పరిషత్‌, వివిధ ప్రభుత్వశాఖల ఆధ్వర్యంలో భారీ జాతీయ పతాకంతో తిరంగా ర్యాలీని బుధవారం నిర్వహించారు. మండల పరిషత్‌ కార్యాలయం నుంచి జాతీయ రహదారి అక్కడి నుంచి ఆర్టీసీ బస్టాండ్‌ వరకు ర్యాలీ కొనసాగింది. ప్రధాన కూడలి వద్ద అమరులకు నివాళుర్పించారు. జడ్పీటీసీ సభ్యుడు మెడబలిమి మల్లికార్జునరావు, దివి మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కొల్లూరి వెంకటేశ్వరరావు, మండలి వెంకట్రామ్‌, నడకుదుటి జనార్దనరావు, రావి నాగేశ్వరరావు, రావి రత్నగిరి, కోట సాయికృష్ణ, కడవకొల్లు సీతారామాంజనేయులు పాల్గొన్నారు.

Updated Date - May 15 , 2025 | 12:42 AM