Share News

బెదిరింపు కాల్స్‌ కలకలం

ABN , Publish Date - May 25 , 2025 | 01:08 AM

నగరంలో శనివారం బాంబు బెదిరింపు కాల్స్‌ కలకలం రేపాయి. బీసెంట్‌ రోడ్డు, రైల్వేస్టేషన్‌లో బాంబులు అమర్చినట్టు పోలీసు కంట్రోల్‌ రూమ్‌కు ఫోన్‌ కాల్‌ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

బెదిరింపు కాల్స్‌ కలకలం
బీసెంట్‌రోడ్డులో తనిఖీలు చేస్తున్న స్క్వాడ్‌

బీసెంట్‌రోడ్డు, రైల్వేస్టేషన్‌లో బాంబులున్నాయంటూ కాల్స్‌

పరుగులు తీసిన పోలీసు యంత్రాంగం

రెండు ప్రదేశాల్లో క్షుణ్ణంగా తనిఖీలు

కేవలం బెదిరింపు కాల్సేనని నిర్ధారణ

ఫోన్‌ చేసిన ఆకతాయి కోసం ఆరా

విజయవాడ, మే 24 (ఆంధ్రజ్యోతి) : నగరంలో శనివారం బాంబు బెదిరింపు కాల్స్‌ కలకలం రేపాయి. బీసెంట్‌ రోడ్డు, రైల్వేస్టేషన్‌లో బాంబులు అమర్చినట్టు పోలీసు కంట్రోల్‌ రూమ్‌కు ఫోన్‌ కాల్‌ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పోలీసులు తిరిగి ఆ నెంబరుకు ఫోన్‌ చేయగా, స్విచ్ఛాఫ్‌ అని వచ్చింది. రెండు రోజుల క్రితం కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ పోలీసులు కానూరులో 15 మంది బంగ్లాదేశ్‌, మయన్మార్‌ దేశాలకు చెందిన రోహింగ్యాలను అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో బాంబు బెదిరింపు కాల్‌ రావడంతో పోలీసులు ఒక్కసారిగా పరుగులు తీశారు. అయితే, ఇది కేవలం ఆకతాయి పనేనని పోలీసులు నిర్ధారించారు. ఫోన్‌ చేసిన వ్యక్తి కోసం ఆరా తీస్తున్నారు.

Updated Date - May 25 , 2025 | 01:08 AM