Share News

బధిరుల ఉన్నతికి ఈ సైన్‌ లెర్నింగ్‌ యాప్‌

ABN , Publish Date - Mar 12 , 2025 | 12:40 AM

డెఫ్‌ అండ్‌ డంబ్‌ విద్యార్థుల ఉన్నతికి ఈ సైన్‌ లెర్నింగ్‌ యాప్‌ ఎంతో ఉపయోగకరంగా ఉందని, యాప్‌ను రూపొందించిన నెక్సటెల్‌ మాటా సంస్థకు అభినందనలు అని రాష్ట్ర ఎంఎస్‌ఎంఈ, సెర్ఫ్‌ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ పేర్కొన్నారు.

బధిరుల ఉన్నతికి ఈ సైన్‌ లెర్నింగ్‌ యాప్‌
విద్యార్థినికి ట్యాబ్‌ అందజేస్తున్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌

బధిరుల ఉన్నతికి ఈ సైన్‌ లెర్నింగ్‌ యాప్‌

మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌

లబ్బీపేట, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): డెఫ్‌ అండ్‌ డంబ్‌ విద్యార్థుల ఉన్నతికి ఈ సైన్‌ లెర్నింగ్‌ యాప్‌ ఎంతో ఉపయోగకరంగా ఉందని, యాప్‌ను రూపొందించిన నెక్సటెల్‌ మాటా సంస్థకు అభినందనలు అని రాష్ట్ర ఎంఎస్‌ఎంఈ, సెర్ఫ్‌ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ పేర్కొన్నారు. హోటల్‌ మిడ్‌ సిటీలో బధిరులకు ట్యాబ్‌ల పంపిణీ కార్యక్రమం మంగళవారం జరిగింది. ముఖ్య అతిఽథిగా విచ్చేసిన మంత్రి కొండపల్లి మాట్లాడుతూ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో బధిరుల కోసం ఈ సైన్‌ మెటా యాప్‌ను రూపొందిం చడమే కాకుండా వారి అభివృద్ధికి దోహదపడేలా ప్రత్యేకంగా లెర్నింగ్‌ క్లాసులను నిర్వహిం చటం, స్వచ్ఛంద సంస్థలు సహకారం అందిం చటం ప్రశంసనీయమని అన్నారు. అనంతరం కోవే స్వచ్ఛంద సంస్థ సహకారంతో గ్రోవెల్‌ ( సంగరాయపాలెం) వారి వితరణతో మడోనా డెఫ్‌ అండ్‌ డంబ్‌ పాఠశాల విద్యార్థులకు ట్యాబ్‌లను పంపిణీ చేశారు. ట్యాబ్‌ల వితర ణలో ఎన్‌ఆర్‌ఐలు బొడ్డపాటి లాస్య, సునీత యాలం, డాక్టర్‌ అనీల్‌, ఎలమంచలి వైదేహీ తమ వంతు సహాయ సహకా రాలను అంద జేశారు. ఈ కార్యక్రమంలో తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌, రేరా మాజీ చైర్మన్‌ వెలమాటి రామ్‌నాఽథ్‌, నెక్స్‌టెల్‌ సంస్థ సీఈవో మిక్కిలినేని శ్రీకాంత్‌, మాఽధురి అట్లూరి పాల్గొన్నారు.

ముగ్గురికి టిఫిన్‌, ఇస్త్రీ బండ్లు పంపిణీ

రామలింగేశ్వరనగర్‌: 16వ డివిజన్‌ బాలాజీనగర్‌లోని గరికపాటి వెంకటేశ్వరరావు వీధిలో మంగళవారం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ పర్యటించి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డివిజన్‌కి చెందిన ముగ్గురు నిరుపేదలకు రూ.65 వేల విలువ చేసే తోపుడు బండి, ఇస్త్రీ బండి, టిఫిన్‌ బండ్లను అందజేశారు.

Updated Date - Mar 12 , 2025 | 12:40 AM