రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
ABN , Publish Date - May 15 , 2025 | 12:39 AM
రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అన్నారు.
బంటుమిల్లి, మే 14(ఆంధ్రజ్యోతి): రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. బుధవా రం వ్యవసాయ శాఖా కార్యాలయంలో రైతులకు కల్టివేటర్లు, పవర్ స్ర్పేయర్లు, పశువుల దాణాను సబ్సిడీపై ఆయన పంపిణీ చేశారు. సీజన్‌కు ముందుగానే అవసరమైన విత్తనాలను దిగుమతి చేసి, అవసరమైన వారికి అందజేయాలని అధికారులకు ఆయన సూచించారు. రైతులు అధిక ధరలతో బయట కొన్నాక, విత్తనాలు అందిచడం సరికాదన్నారు. బంటుమి ల్లి, కృత్తివెన్ను మండలాలకు సంబంధించి రూ.30,10,530 విలువైన 62 కల్టివేటర్లను, రూ.6,20,670 విలువైన 31 పవర్ స్ర్పేయర్లను అందజేశారు. పాడి రైతులకు 50 సబ్సిడీపై పశువుల దాణా అందజేశారు. టీడీపీ మండల అధ్యక్షుడు కూనపరెడ్డి వీరబాబు, బొర్రా కాశీ, ఒడుగు తులసీరావు, కూనసాని చిన్నా, వ్యవసాయశాఖ ఏడీఏ గౌతమ్, ఏ వో శివరామకృష్ణ, జెన్నీ, పశువైద్యురాలు స్ఫూర్తి పాల్గొన్నారు.