Share News

‘పునఃప్రారంభం’ సభతో నవ్యాంధ్ర నవశకానికి నాంది

ABN , Publish Date - May 04 , 2025 | 01:01 AM

అమరావతి సభ విజయవంతంపై నెట్టెం రఘురాం విలేకరులతో మాట్లాడారు.

‘పునఃప్రారంభం’ సభతో నవ్యాంధ్ర నవశకానికి నాంది

టీడీపీ ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షుడు నెట్టెం రఘురాం

జగ్గయ్యపేట, మే 3(ఆంధ్రజ్యోతి): ‘ప్రధాని మోదీ ఇచ్చిన హామీలతో అమరావతి రాజధాని పునఃప్రారంభం సభ ఐదు కోట్ల ఆంధ్రుల ఆశలకు ఊపిరులు ఊదింది. నవ్యాంధ్రలో నవశకానికి నాంది పలికింది.’ అని టీడీపీ ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షుడు నెట్టెం రఘురాం అన్నారు. శనివారం అమరావతి సభ విజయవంతంపై ఆయన విలేకరులతో మాట్లాడారు. సభలో ప్రధాని మోదీ చేసిన ప్రసంగం రాష్ట్ర ప్రజలకు ఎం తో ఉత్సాహాన్నిచ్చిందని, భవిష్యత్‌పై ఎన్నో అంచనాలు కల్పించిందని ఆయన తెలిపారు. ఐదేళ్లలో నిర్వీర్యమైన రాజధానికి పదే పది నెలల్లో రూపురేఖలు తెచ్చి, ప్రధాని మోదీతో పునఃశంకుస్థాపన, రూ.60 వేల కోట్లతో పనులకు వర్చువల్‌గా శంకుస్తాపన చేయించటం, భవిష్యత్‌లోను ఇదే మద్దతు కొనసాగిస్తామని హామీ పొందటం చంద్రబాబు విజన్‌కు నిదర్శనమని అన్నారు. డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌, మంత్రి నారా లోకేశ్‌లు స్పష్టంగా ప్రజలు ఏమి కోరుకుంటున్నారో చెప్పి ప్రధాని మోదీని ఆ దిశగా హామీ ఇప్పించగలిగారని తెలిపారు.

Updated Date - May 04 , 2025 | 01:01 AM