Share News

అద్భుత రాజధాని అమరావతి

ABN , Publish Date - May 01 , 2025 | 12:42 AM

ప్రపంచంలోనే అమరావతిని అద్భుత రాజధానిగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కృషిచేస్తున్నారని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, గౌడ కార్పొరేషన్‌ చైర్మన్‌ వీరంకి వెంకటగురుమూర్తి అన్నారు.

అద్భుత రాజధాని అమరావతి
మాట్లాడుతున్న ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, ఏపీ ఆర్గానిక్‌ ప్రొడక్ట్‌ అథారిటీ సర్టిఫికేషన్‌ చైర్మన్‌ శావల దేవదత్‌, వీరంకి గురుమూర్తి

ప్రపంచంలోనే ఉత్తమమైనదిగా సీఎం చంద్రబాబు తీర్చిదిద్దుతారు: ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, శావల దేవదత్‌, గురుమూర్తి

తిరువూరు, ఏప్రిల్‌ 30(ఆంధ్రజ్యోతి): ప్రపంచంలోనే అమరావతిని అద్భుత రాజధానిగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కృషిచేస్తున్నారని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, గౌడ కార్పొరేషన్‌ చైర్మన్‌ వీరంకి వెంకటగురుమూర్తి అన్నారు. బుధవారం ఫ్యాక్టరీ సెంటర్‌లోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఏపీ ఆర్గానిక్‌ ప్రొడక్ట్‌ సర్టిఫికేషన్‌ అథారిటీ చైర్మన్‌ శావల దేవదత్‌, పార్టీ నియోజకవర్గ పరిశీలకుడు సుఖవాసి శ్రీనివాసరావు మాట్లాడారు. మూడు రాజధానుల పేరు చెప్పి అమరావతి అభివృద్ధిని గత ప్రభుత్వంలో వైసీపీ పాలకులు విస్మరించారన్నారు. మే 2న అమరావతి పునర్నిర్మాణ కార్యాక్రమానికి ప్రధాని నరేంద్రమోదీ రాక సందర్భంగా, తిరువూరు నియోజకవర్గం నుంచి రాజధాని అభివృద్ధి కాముకులు వేలాదిగా తరలిరావలని వారు పిలుపునిచ్చారు. నియోజకవర్గం నుంచి 150 వాహనాలు ఏర్పాటు చేశామని, 1000 ఇతర వాహనాల్లో ప్రజలు తరలివచ్చేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. రాజధాని అభివృద్ధిలో భాగంగా భూసేకరణ చేస్తుంటే కొందరు తప్పుడు విమర్శలు చేస్తున్నారని, రాజధాని 30 వేల ఏకరాలకే పరిమితం కాకూడదని, ఎంతవరకు విస్తరిస్తే రాష్ట్రం అంత ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు.

విధ్వంసమైన అమరావతి పునర్నిర్మాణమే సీఎం చంద్రబాబు ధ్యేయం: ఉండవల్లి శ్రీదేవి

జగ్గయ్యపేట: గత జగన్‌ ప్రభుత్వంలో విధ్వంసానికి గురైన అమరావతిని పునర్నిర్మాణం చేసే దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉన్నారని, ప్రధాని మోదీతో అందుకే పనులు ప్రారంభింపజేస్తున్నారని మాదిగ కార్పొరేషన్‌ రాష్ట్ర చైర్మన్‌ ఉండవల్లి శ్రీదేవి అన్నారు. బుధవారం పట్టణంలోని మునిసిపల్‌ కార్యాలయానికి వచ్చిన ఆమె కూటమి కౌన్సిలర్లతో మాట్లాడారు. అంతర్జాతీయ నగరంగా అమరావతి నిలవబోతుందన్నారు. రాజధాని సభకు వచ్చే వారికి బస్సులు, మంచినీళ్లు, మజ్జిగ అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. టీడీపీ నియోజకవర్గ సమన్వయకమిటీ సభ్యుడు శ్రీరాం చినబాబు, మునిసిపల్‌ చైర్మన్‌ రంగాపురం రాఘవేంద్ర, కౌన్సిలర్‌ కన్నెబోయిన రామలక్ష్మి, కమిషనర్‌ రామ్మోహన్‌, నకిరికంటి వెంకటి పాల్గొన్నారు.

Updated Date - May 01 , 2025 | 12:42 AM