Share News

ప్రభుత్వం చర్చలకు పిలవాలి

ABN , Publish Date - May 06 , 2025 | 12:47 AM

ప్రభుత్వం స్పందించి తమతో చర్చించి సమస్యలు పరిష్కరించాలని కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్లు డిమాండ్‌ చేశారు.

ప్రభుత్వం చర్చలకు పిలవాలి
నిరసనలో పాల్గొన్న సీహెచ్‌వోలు

ధర్నాచౌక్‌, మే 5 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం స్పందించి తమతో చర్చించి సమస్యలు పరిష్కరించాలని కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్లు డిమాండ్‌ చేశారు. సమ్మెలో భాగంగా ధర్నాచౌక్‌లో సోమవారం ఽనిరసన కార్యక్రమం నిర్వహించారు. ఆయుష్మాన్‌ భారత నిబంధనల మేరకు ఆరేళ్లు పూర్తి చేసుకున్న సీహెచ్‌వోలను రెగ్యులర్‌ చేయాలని, ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులతో సమానంగా 23శాతం వేతన సవరణ జరగాలని డిమాండ్‌ చేశారు. పని అధారిత ప్రోత్సహకాలను క్రమబద్ధీకరించాలన్నారు. ఈపీఎఫ్‌ఓ పునరుద్ధరించాలని, క్లినిక్‌ అద్దె బకాయిలు వెంటనే చెల్లించి, నిర్ధిష్టమైన జాబ్‌ చార్ట్‌ అందించాలని డిమాండ్‌ చేశారు. ఎఫ్‌ఆర్‌ఎస్‌ నుంచి సీహెచ్‌ఓలకు మినహాయింపునివ్వాలన్నారు. హెచ్‌ఆర్‌ పాలసీ, ఇంక్రిమెంట్‌, ట్రాన్స్‌ఫర్‌, ఎక్స్‌గ్రేషియా, తదితరాలు అమలు చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్‌ మిడ్‌ లెవల్‌ ప్రొవైడర్స్‌ అసోసియేషన్‌ (ఏపీఎంసీఏ) ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో అధ్యక్షుడు సందీప్‌, ఎన్టీఆర్‌ జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ వర్షిణీ, జనరల్‌ సెక్రటరీ నవీన్‌, భవ్య, మారేశ్వరీ, భవ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 06 , 2025 | 12:47 AM