Share News

సమస్యలకు శాశ్వత పరిష్కారమే లక్ష్యం

ABN , Publish Date - May 06 , 2025 | 12:45 AM

ప్రజల సమస్యలను వేగంగా, సమర్థంగా పరిష్కరించడం నగరపాలకసంస్థ ప్రధాన లక్ష్యమని వీఎంసీ ఇన్‌చార్జి కమిషనర్‌ డాక్టర్‌ చంద్రశేఖర్‌ఈన్నారు.

సమస్యలకు శాశ్వత పరిష్కారమే లక్ష్యం
అర్జీలను స్వీకరిస్తున్న ఇన్‌చార్జి కమిషనర్‌ డాక్టర్‌ చంద్రశేఖర్‌

కార్పొరేషన్‌, మే 5 (ఆంధ్రజ్యోతి) : ప్రజల సమస్యలను వేగంగా, సమర్థంగా పరిష్కరించడం నగరపాలకసంస్థ ప్రధాన లక్ష్యమని వీఎంసీ ఇన్‌చార్జి కమిషనర్‌ డాక్టర్‌ చంద్రశేఖర్‌ఈన్నారు. నగరపాలకసంస్థ ప్రధాన కార్యాలయంలో కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌లో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను అధికారులతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్‌ మాట్లాడుతూ నగర ప్రజల నుంచి ఫిర్యాదులు అందిన వెంటనే వాటికి శాశ్వత పరిష్కారం అందేలా అధికారులు చర్యలు తీసుకో వాలని ఆదేశించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో 9ఫిర్యాదులు అందగా, అందులో పట్టణ ప్రణాళికశాఖ-4, ఇంజనీరింగ్‌-3, రెవెన్యూ-1, ఉద్యాన-1 శాఖలకు సంబంధించి ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. కార్యక్రమంలో చీఫ్‌ సిటీ ప్లానర్‌ సంజయ్‌ రత్నకుమార్‌, చీఫ్‌ ఇంజనీర్‌ ఆర్‌.శ్రీనాథ్‌రెడ్డి, డిప్యూటీ కమిషనర్‌ రెవెన్యూ జి. సృజన, సూపరింటెండింగ్‌ ఇంజనీర్లు పి.సత్యనారాయణ, పి. సత్యకుమారి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 06 , 2025 | 12:45 AM