Share News

క్రీడల అభివృద్ధే అజెండాగా పనిచేయాలి

ABN , Publish Date - Apr 12 , 2025 | 12:32 AM

ఆంధ్రప్రదేశ్‌ క్రీడాప్రాధికార సంస్థ కార్యకలాపాలను మరింత విస్తృతం చేయాలని, క్రీడల అభివృద్ధే అజెండాగా అంకితభావంతో పనిచేయాలని శాప్‌ చైర్మన్‌ అనిమిని రవినాయుడు సూచించారు.

క్రీడల అభివృద్ధే అజెండాగా  పనిచేయాలి

క్రీడల అభివృద్ధే అజెండాగా పనిచేయాలి

శాప్‌ చైర్మన్‌ అనిమిని రవినాయుడు

విజయవాడ(స్పోర్స్ట్‌), ఏప్రిల్‌ 11 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ క్రీడాప్రాధికార సంస్థ కార్యకలాపాలను మరింత విస్తృతం చేయాలని, క్రీడల అభివృద్ధే అజెండాగా అంకితభావంతో పనిచేయాలని శాప్‌ చైర్మన్‌ అనిమిని రవినాయుడు సూచించారు. శాప్‌ కార్యాలయంలో శుక్రువారం శాప్‌ అధికారులతో క్రీడల అభివృద్ధి, సమ్మర్‌ క్యాంపుల నిర్వహణ పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ క్రీడా సంఘాలను సమన్వయం చేసుకుని రాష్ట్రంలో పెద్ద ఎత్తున క్రీడాపోటీలను నిర్వహిం చేందుకు అధికారులు కృషి చేయా లని, స్పోర్స్ట్‌ ఫెడరేషన్లు నిర్వహించే క్రీడలను రాష్ట్రంలోనే నిర్వహించేలా చర్యలు చేపట్టాలన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే నిర్వహించనున్న సమ్మర్‌ క్యాంపులను సమర్ధవంతంగా నిర్వహించాలని, ఈ నెల 20 నాటికి అన్ని జిల్లాల డీఎస్డీవోల కు సమగ్ర సమాచారాన్ని పంపిం చాలని అధికారులకు సూచించారు. సమ్మర్‌ క్యాంపులోని క్రీడా కార్యక్రమాలన్నీ క్రీడాయాప్‌లో ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేయాలని అధికారులను అదేశించారు.

Updated Date - Apr 12 , 2025 | 12:32 AM