Share News

కౌలు రైతులకు సబ్సిడీపై విత్తనాలివ్వాలి: కౌలు రైతు సంఘం

ABN , Publish Date - May 19 , 2025 | 12:23 AM

ఖరీఫ్‌ సీజన్‌ జూన్‌ మొదటి వారం నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో కౌలు రైతులకు సబ్సిడీతో కూడిన సర్టిఫైడ్‌ పంట విత్తనాలు అం దించాలని ఆంధ్రప్రదేశ్‌ కౌలు రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎ.కాటమయ్య, ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య ఆదివారం ఓ ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు.

కౌలు రైతులకు సబ్సిడీపై విత్తనాలివ్వాలి: కౌలు రైతు సంఘం

విజయవాడ రూరల్‌, మే 18(ఆంధ్రజ్యోతి): ఖరీఫ్‌ సీజన్‌ జూన్‌ మొదటి వారం నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో కౌలు రైతులకు సబ్సిడీతో కూడిన సర్టిఫైడ్‌ పంట విత్తనాలు అం దించాలని ఆంధ్రప్రదేశ్‌ కౌలు రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎ.కాటమయ్య, ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య ఆదివారం ఓ ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు. వెంటనే సాగు ప్రణాళిక ప్రకటించి, సాగుకు అవసరమైన చర్యలు చేపట్టాలని వారు కోరారు. మార్కెట్‌లో విత్తనాల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని, న కిలీ విత్తనాలు కొని పలుచోట్ల రైతులు మోసపోతున్నారని పే ర్కొన్నారు. నకిలీ విత్తనాలు అమ్ముతున్న ప్రైవేటు సంస్థలపై కఠినంగా వ్యవహరించాలని కోరారు. నాశిరకం విత్తనాలు విక్రయిస్తున్న ఏజెన్సీల నిర్వాహకులపై అవసరమైతే పీడీ యాక్ట్‌ ప్ర యోగించాలని, ప్రభుత్వ ధ్రువీకరణ విత్తనాలు మాత్రమే మా ర్కెట్‌లో అమ్మేలా చూడాలని వారు కోరారు.

Updated Date - May 19 , 2025 | 12:31 AM