Share News

మహానాడుకు తెలుగు తమ్ముళ్లు

ABN , Publish Date - May 27 , 2025 | 12:53 AM

కడపలో మంగళ, బుధ, గురువారాల్లో జరిగే మహానాడు కార్యక్రమానికి మైలవరం, నందిగామ, తిరువూరు నియోజకవర్గాల నుంచి టీడీపీ శ్రేణులు భారీగా తరలివెళ్లారు.

మహానాడుకు తెలుగు తమ్ముళ్లు
గొల్లపూడిలో కడప మహానాడుకు వెళుతున్న కార్లకు జెండా ఊపి పంపుతున్న ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌

గొల్లపూడి/నందిగామ/చందర్లపాడు/తిరువూరు, మే 26 (ఆంధ్రజ్యోతి): కడపలో మంగళ, బుధ, గురువారాల్లో జరిగే మహానాడు కార్యక్రమానికి మైలవరం, నందిగామ, తిరువూరు నియోజకవర్గాల నుంచి టీడీపీ శ్రేణులు భారీగా తరలివెళ్లారు. మైలవరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్‌ సారధ్యంలో భారీగా శ్రేణులు తరలివెళ్లాయి. సోమవారం విజయవాడ రూరల్‌ మండలం గొల్లపూడిలో టీడీపీ కార్యాలయం వద్ద నుంచి బయలుదేరిన మహానాడు కాన్వాయ్‌కు ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్‌ జెండా ఊపి సాగనంపారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రతిబింబిస్తూ టీడీపీ ఏర్పడిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల కాలంలోనే ఎన్టీఆర్‌ అధికారంలోకి రావటం చారిత్రక విశేషమన్నారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, టీడీపీ జాతీయ కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్‌లు పార్టీని సమర్థవంతంగా నడిపిస్తూ తిరుగులేని శక్తిగా పార్టీని మార్చారన్నారు. రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు ఎంతో శ్రమిస్తున్నారని అన్నారు. టీడీపీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శులు జంపాల సీతారామయ్య, బొమ్మసాని సుబ్బారావు, కె.విజయ్‌బాబు, నేతలు చెన్నుబోయిన చిట్టిబాబు, రామినేని రాజశేఖర్‌ (రాజ), ఉయ్యూరు వెంకట నరసింహారావు, ముప్పిడి నాగేశ్వరరెడ్డి, ఈమని మురళీ, సుకవాసి శ్రీహరి, మన్నం వెంకటచౌదరి పాల్గొన్నారు.

నందిగామ, చందర్లపాడు నుంచి..

మహానాడుకు నందిగామ, చందర్లపాడు నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లారు. నందిగామలోని పార్టీ కార్యాలయం వద్ద బాణాసంచా కాల్చి సందడి చేశారు. తొలిసారిగా కడపలో జరుగుతున్న మహానాడుకు భారీగా శ్రేణులు తరలిరావాలని ప్రభుత్వ విప్‌ తంగిరాల సౌమ్య పిలుపునిచ్చారు. చందర్లపాడు నుంచి ఎన్‌ఎ్‌సఎల్‌బీసీ ప్రాజెక్టు కమిటీ చైర్మన్‌ కోట వీరబాబు ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు కడప తరలివెళ్లారు. టీడీపీ మండల అధ్యక్షుడు మేకల సుధాకర్‌, ఉన్నం నరసింహారావు, మన్నెం వేణుప్రసాద్‌ పాల్గొన్నారు.

తిరువూరు నుంచి..

మహనాడుకు తిరువూరు నుంచి ప్రత్యేక వాహనాల్లో ఏఎంసీ మాజీ చైర్మన్‌ తాళ్లూరి రామారావు, కౌన్సిలర్లు షేక్‌ అబ్దుల్‌హుస్సేన్‌. నాళ్లా సు రేంద్ర, పలువురు టీడీపీ నాయకులు ప్రత్యేక వాహనాల్లో తరలి వెళ్లారు.

Updated Date - May 27 , 2025 | 12:53 AM