టీడీపీ కొత్త పార్లమెంటరీ కమిటీలు
ABN , Publish Date - Dec 25 , 2025 | 01:02 AM
పార్లమెంటరీ పార్టీ నూతన కమిటీలను బుధవారం టీడీ పీ అధిష్ఠానం ప్రకటించింది. ఎన్టీఆర్, కృష్ణాజిల్లాలకు సంబంధించి విజయవాడ, మచిలీపట్నం పార్లమెంటరీ పార్టీ కమిటీలను ప్రకటించారు. అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కాకుండా ఎన్టీఆర్ జిల్లాకు 39 మంది, కృష్ణాజిల్లాకు 40 మందితో నూతన కమిటీ ఏర్పాటైంది.
విజయవాడ, మచిలీపట్నానికి నియామకం
ఎన్టీఆర్ జిల్లాకు 39 మంది, కృష్ణాజిల్లాకు 40 మంది
జిల్లాస్థాయిలో ప్రమాణ స్వీకారంపై రాని స్పష్టత
విజయవాడ అర్బన్, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి) : పార్లమెంటరీ పార్టీ నూతన కమిటీలను బుధవారం టీడీ పీ అధిష్ఠానం ప్రకటించింది. ఎన్టీఆర్, కృష్ణాజిల్లాలకు సంబంధించి విజయవాడ, మచిలీపట్నం పార్లమెంటరీ పార్టీ కమిటీలను ప్రకటించారు. అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కాకుండా ఎన్టీఆర్ జిల్లాకు 39 మంది, కృష్ణాజిల్లాకు 40 మందితో నూతన కమిటీ ఏర్పాటైంది. ఉపాధ్యక్షులు, ఆర్గనైజింగ్ సెక్రటరీలు, సెక్రటరీలు, అధికార ప్రతినిధులు, మీడియా కో ఆర్డినేటర్లను నియమించారు. వీరి ప్రమాణ స్వీకారం ఎప్పుడన్న దానిపై స్పష్టత రాలేదు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జిల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల ప్రమాణస్వీకారం ముందుగా చేయించి, ఆ తర్వాత అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జిల్లాస్థాయిలో కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించే అవకాశాలు కనిపిస్తోంది.
కృష్ణాజిల్లా కమిటీ ఇదే..
కృష్ణాజిల్లా టీడీపీ అధ్యక్షుడిగా పామర్రుకు చెందిన వీరంకి గురుమూర్తి, ప్రధాన కార్యదర్శిగా మచిలీపట్నానికి చెందిన గోపు సత్యనారాయణ ఇప్పటికే నియమితులయ్యారు. ఉపాధ్యక్షులుగా లకనం నాగాంజనేయులు (అవనిగడ్డ), మొవ్వా వెంకటేశ్వరరావు (గన్నవరం), గుత్తా శివరామకృష్ణ (గుడివాడ), మండపాక శంకరబాబు (పామర్రు), మోటమర్రి బాబూప్రసాద్ (మచిలీపట్నం), అన్నం హరిరామకృష్ణ (పెడన), రేవు నాగలక్ష్మి (పెడన), వంగవీటి శ్రీనివాస్ ప్రసాద్ (పెనమలూరు), కంభంపాటి లక్ష్మీనరసమ్మ (గన్నవరం)ను నియమించారు. ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా ఉమ్మిడిశెట్టి శ్రీరామమూర్తి (పెడన), పాముల ప్రకాశ్‌రావు (పామర్రు), చీదరబోయిన సీతయ్య (గుడివాడ), నెరెసు రాజ్యలక్ష్మి (పెనమలూరు), మహ్మద్ రిజ్వానా బేగం (పెనమలూరు), పొదిలి లలిత (గన్నవరం), నీలగిల్లి వసంతకుమారి (మచిలీపట్నం), కొల్లూరి బసవేశ్వరరావు (అవనిగడ్డ), రమేశ్ భూపతి (పెడన)ను నియమించారు. అధికార ప్రతినిధులుగా శొంటి రామకృష్ణ (గుడివాడ), రావి రత్నగిరి (అవనిగడ్డ), పేర్లకోస్తా మురళీకృష్ణ (మచిలీపట్నం), కూనసాని రత్నకుమార్ (పెడన), కాకాని సుధారాణి (పామర్రు), గుండెపూడి నితీశ్ కుమార్ (గన్నవరం), హరికృష్ణ తుమ్మలపల్లి (పెనమలూరు), సయ్యద్ ఖాజా (మచిలీపట్నం), దాసరి సాంబశివరావు (గన్నవరం)ను నియమించారు. సెక్రటరీలుగా సోలె భార్గవి (అవనిగడ్డ), జొన్నలగడ్డ సుధాకర్ (గన్నవరం), వేమూరి సుజాత (గుడివాడ), బత్తుల కామేశ్వరరావు (పెనమలూరు), అవనిగడ్డ ప్రకాశం (అవనిగడ్డ), గొరిపర్తి రవికుమార్ (పామర్రు), తోట వెంకట నాగలక్ష్మి (అవనిగడ్డ), రాజులపాటి సురేఖ (పామర్రు), సమ్మెట ఉమాదేవి (గుడివాడ)ను, ట్రెజరర్లుగా బెజవాడ నాగేశ్వరరావు (గన్నవరం), ఆఫీస్ సెక్రటరీగా బత్తిన మురళీ వెంకటదాస్ (మచిలీపట్నం), పార్లమెంట్ మీడియా కో-ఆర్డినేటర్‌గా రెహమాన్ బేగ్ (పెడన), సోషల్ మీడియా కో-ఆర్డినేటర్‌గా ఉప్పలపాటి ప్రవీణ్ కుమార్ (పెనమలూరు) నియామకం జరిగింది.
ఎన్టీఆర్ జిల్లా కమిటీ ఇదే..
ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలిగా గద్దె అనూరాధ, ప్రధాన కార్యదర్శిగా చెన్నుబోయిన చిట్టిబాబును నియమించారు. ఉపాధ్యక్షులుగా నూకల సత్యనారాయణ (జగ్గయ్యపేట), వేమ వెంకట్రావు (నందిగామ), ధరణికోట విజయలక్ష్మి (మైలవరం), తాళ్లూరి రామారావు (తిరువూరు), చలసాని రామారావు (విజయవాడ తూర్పు), కొట్టేటి హనుమంతరావు (పశ్చిమ), తమ్మా విజయలక్ష్మి (సెంట్రల్), బొల్లిపోగు కల్యాణి (తిరువూరు), నార్ల సుగుణ (నందిగామ)ను నియమించారు. ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా దర్శి విజయనరసింహారావు (జగ్గయ్యపేట), వేల్పుల భిక్షాలు (నందిగామ), జమీల్ అంబిద్దీన్ మొహ్మద్ (మైలవరం), ఆకుల రాధాకృష్ణ (తిరువూరు), దోమకొండ రవి (తూర్పు), పేరాబత్తుల వెంకటేశ్వరరావు (పశ్చిమ), పలగాని భాగ్యలక్ష్మి (సెంట్రల్), షేక్ హసీన (పశ్చిమ)ను నియమించారు. పార్లమెంట్ అధికార ప్రతినిధులుగా నల్లమోలు వెంకట శివరామప్రసాద్ (జగ్గయ్యపేట), గూడూరు శ్రీనివాస్ (నందిగామ), కారుమంచి దుర్గారావు (మైలవరం), ఆవాల రమేశ్‌రెడ్డి (తిరువూరు), పటాన్ హయత ఖాన్ (తూర్పు), రేగళ్ల లక్ష్మణరావు (పశ్చిమ), వింజమూరి సతీష్‌బాబు (సెంట్రల్), అమిరినేని కరుణకుమారి (తూర్పు), జామ ఆనందరావు (జగ్గయ్యపేట)ను నియమించారు. సెక్రటరీలుగా ఏసుపోగు నాగమణి (జగ్గయ్యపేట), షేక్ గౌసియా (సెంట్రల్), పంజూరు రవికుమార్ (మైలవరం), బొడుకుల ప్రేమరాజ్ (తిరువూరు), అప్పన్న రమణయ్య (జగ్గయ్యపేట), మోదుగ భవానీ (పశ్చిమ), గరిమెళ్ల రాధిక (సెంట్రల్), పగడాల రమాదేవి (పశ్చిమ), పెనుగొండ శ్రీనివాస్ (తూర్పు), పార్లమెంటరీ ట్రెజరర్‌గా నాదెళ్ల నాగమణి (తిరువూరు), పార్లమెంట్ ఆఫీస్ సెక్రటరీగా తానూరి గాయత్రి (నందిగామ), పార్లమెంట్ మీడియా కో-ఆర్డినేటర్‌గా కలవకొలను రామకృష్ణ ప్రసాద్ (సెంట్రల్), పార్లమెంట్ సోషల్ మీడియా కో-ఆర్డినేటర్‌గా సీహెచ్ కృష్ణారావు (నందిగామ)ను నియమించారు.